Padma Vibhushan Awards: కేంద్ర ప్రభుత్వం ప్రతి యేడాది వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన వారికీ పద్మ అవార్డులను ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. 2024 గాను తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు ప్రముఖ వ్యక్తులైన వెంకయ్య నాయుడిగారికి,చిరంజీవికి ఒకేసారి పద్మ విభూషణ్ అవార్డు రావడంపై ఇరు రాష్ట్రాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిరు.. మాజీ ఉప రాష్ట్రపతిని మర్యాద పూర్వకంగా కలవడం రాజకీయ ప్రాధాన్యత సంతకరించుకుంది. వీరిద్దరికి ఒకేసారి అవార్డులు ఇవ్వడం వెనక రాజకీయ ప్రాధాన్యత ఉందా అంటే ఔననే అంటున్నాయి రాజకీయ వర్గాలు.
Padma awards 2022: గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ ఏడాదికి సంబంధించిన పద్మ అవార్డు గ్రహీతలను కేంద్ర ప్రభుత్వం మంగళవారం (జనవరి 25) రాత్రి ప్రకటించింది. సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ కు పద్మ విభూషణ్, కొవిగ్జిన్ సృష్టించిన భారత్ బయోటెక్ సంస్థ ఎండీ కృష్ణ ఎల్లా దంపతులకు పద్మ భూషణ్, ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రాను పద్మ శ్రీ అవార్డుకు ఎంపిక చేశారు.
GST Collection November 2021: దేశంలో గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ వసూళ్ల ద్వారా కేంద్ర ప్రభుత్వం మరో రూ.లక్ష కోట్లను వసూలు చేసింది. వస్తు, సేవల పన్ను ద్వారా నవంబరు నెలకు గానూ రూ.1.31 లక్షల కోట్లను వసూలు చేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది.
Postmortem After Sunset: ఇకపై సూర్యాస్తమయం తర్వాత కూడా మృతదేహాలకు పోస్టుమార్టం చేసేందుకు అనుమతించింది కేంద్రప్రభుత్వం. పోస్టుమార్టం చేసేందుకు అవసరమైన అన్ని సౌకర్యాలున్న ఆస్పత్రుల్లో 24 గంటలూ పోస్టుమార్టం చేసేందుకు నిర్ణయించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు.
Delhi Lockdown News: ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ రోజురోజుకు పెరుగుతుండడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇంట్లో కూడా మాస్క్ లు ధరించాల్సిన దుస్థితి ఏర్పడిందని పేర్కొంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఢిల్లీలో రెండు రోజుల లాక్ డౌన్ విధించే అవకాశం ఉందా? అని అత్యున్నత న్యాయస్థానం కేంద్రాన్ని ప్రశ్నించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.