విమానం టేకాఫ్ అవుతుందనడానికి కొన్ని నిమిషాల ముందు ఉన్నట్టుండి ఓ పక్షి ఎగిరొచ్చి విమానంలోకి ప్రవేశించింది. గోల్ కొట్టినట్టుగా సరిగ్గా వచ్చి విమానంలోకి అయితే దూరింది కానీ.. అందులోంచి తిరిగి ఎలా బయటపడాలో అర్థం కాక అందులోనే చక్కర్లు కొట్టసాగింది. అయోమయంలో పడిన ప్రయాణికులు ఏం జరుగుతుందో అర్థం కాక అలా చూస్తుండిపోగా... ఇంకొంతమంది పోతే రాదు ఈ దృశ్యం అన్నట్టుగా తమ మొబైల్ కెమెరాల్లో బంధిస్తూ బిజీ అయ్యారు. ఇంతకీ ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే.
తృటిలో పెద్ద విమాన ప్రమాదం తప్పింది. కోయంబత్తూరు నుంచి హైదరాబాద్ వస్తున్న 6E 779, బెంగళూరు నుంచి కొచ్చి వెళ్తున్న 6E 6505 ఇండిగోకు చెందిన రెండు వినానాలు ఎదురుపడ్డాయి. బెంగళూరు వద్ద ఆకాశంలో చాలా సమీపంగా వచ్చాయి. వాటి మధ్య ఎత్తులో తేడా కేవలం 200 అడుగులు మాత్రమే ఉంది. ట్రాఫిక్ కొలిషన్ సిస్టమ్ ద్వారా హెచ్చరికలు జారీ చేయడంతో రెండు విమానాల్లోని పైలట్లు వెంటనే స్పందించి ప్రమాదం జరగకుండా నివారించారు. జూలై 10న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
శనివారం మలిండో ఎయిర్ లైన్స్‌కి చెందిన విమానం అలా గాల్లోకి లేచిందో లేదో బంగ్లాదేశ్‌కి చెందిన ఓ యువ ప్రయాణికుడు వెంటనే హడావుడిగా బట్టలిప్పేయడం మొదలుపెట్టాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.