Samsung Galaxy S23: పవర్‌ఫుల్ ప్రాసెసర్‌తో సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23.. ఫీచర్స్ ఏంటో తెలుసా..?

Samsung Galaxy S23:ప్రస్తుతం సామ్‍సంగ్ గెలాక్సీ పవర్ఫుల్ ప్రాసెస్ తో కూడిన ఫోన్స్ ను మార్కెట్లో లాంచ్ చేయడం జరిగింది. సామ్‍సంగ్ గెలాక్సీ నుంచి  గెలాక్సీ ఎస్ 23 + ,గెలాక్సీ ఎస్23 అల్ట్రా లాంచ్ చేశారు.

Last Updated : Oct 14, 2023, 02:28 PM IST
Samsung Galaxy S23: పవర్‌ఫుల్ ప్రాసెసర్‌తో  సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23.. ఫీచర్స్ ఏంటో తెలుసా..?

Samsung Galaxy S23: మొబైల్ ఫోన్స్ ఒకప్పుడు కేవలం మాట్లాడుకోవడానికే ఉపయోగించేవారు .కానీ టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ప్రపంచం మొత్తం మన చేతిలో మొబైల్ ఫోన్ రూపంలో ఇమిడిపోయిందా అని అనిపిస్తుంది. ఇప్పుడు మొబైల్ ఫోన్ అనేది కేవలం కమ్యూనికేషన్ కోసం వాడే ఒక సాధనం మాత్రమే కాదు అంతకుమించి అనేట్టుగా ఉంది ట్రెండ్. రెండుకు తగినట్టుగానే ఎప్పటికప్పుడు మార్కెట్లో కంపెనీలు తమ లేటెస్ట్ మొబైల్ ఫోన్స్ ని విడుదల చేస్తూనే ఉన్నాయి. ప్రతి ఫోన్ కి సంబంధించిన ఫీచర్స్ ని చూసి ఆ ఫోన్ తీసుకోవడం యూత్ కి బాగా అలవాటు.

ఈ నేపథ్యంలో ప్రస్తుతం సామ్‍సంగ్ గెలాక్సీ పవర్ఫుల్ ప్రాసెస్ తో కూడిన ఫోన్స్ ను మార్కెట్లో లాంచ్ చేయడం జరిగింది. సామ్‍సంగ్ గెలాక్సీ నుంచి ఎస్ 23 గెలాక్సీ ఎస్ 23 + ,గెలాక్సీ ఎస్23 అల్ట్రా లాంచ్ చేయబడ్డాయి. మొత్తం మీద సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23 సిరీస్ నుంచి లాంచ్ అయిన ఈ మూడు ఫ్లాట్ షిప్ మొబైల్ ప్రస్తుతం మార్కెట్ లో ఫుల్ క్రేజ్ తో ఉన్నాయి. ఇంతకీ వాటి ఫీచర్స్, రేట్స్ ఎలా ఉన్నాయో ఓ లుక్ వేద్దాం పదండి..

సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23 సిరీస్‍లో భాగంగా విడుదలైన మూడు ఫ్లాగ్‍షిప్ మొబైల్స్ క్వాల్కామ్ లేటెస్ట్ స్నాప్‍డ్రాగన్ 8 జెన్ 2 పవర్ఫుల్ ప్రాసెసర్ ను కలిగి ఉన్నాయి. అలాగే డిస్ప్లే విషయానికి వస్తే ఇవి డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్ డిస్ప్లే తో వస్తాయి. అలాగే ఈ ఫోన్ వాటర్ రెసిస్టెంట్ కూడా..కాబట్టి జాగింగ్ ,వాకింగ్ కి వెళ్లేవారు ఫోన్ చెమటకి పాడైపోతుంది ఏమో అని భయపడాల్సిన పని లేదు.

సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23 స్పెసిఫికేషన్స్:

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఫోన్స్ కి ధీటుగా మంచి స్పెసిఫికేషన్స్ తో సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23 సిరీస్ ను విడుదల చేసింది. ఈ ఫోన్ కి ఉండే 6.1 ఇంచేస్ ఫుల్ హెచ్‍డీ, డైనమిక్ అమోలెడ్ డిస్‍ప్లే మంచి వీడియో  ఎక్స్పీరియన్స్ ని అందిస్తుంది. దీనితో పాటుగా విజన్ బూస్టర్, గొరిల్లాగ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ లాంటి ఫీచర్స్ కూడా ఇచ్చారు. ఇక కెమెరా విషయానికి వస్తే ఫోన్ వెనుక మూడు కెమెరాల సెటప్ చేయబడింది. ప్రైమరీ కెమెరా కు 50 మెగాపిక్సెల్,టెలిఫొటో కెమెరా కు 12 మెగాపిక్సెల్,  12 మెగాపిక్సెల్ సెల్ఫీ ఫ్రంట్ కెమెరా సపోర్ట్ ఇచ్చారు.

3,900 ఎంఏహెచ్ బ్యాటరీ ప్రొవైడ్ చేయడంతో బ్యాటరీ లైఫ్ కూడా బ్రహ్మాండంగా ఉంది. సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23 ఫోన్ లో వచ్చిన రెండు వేరియంట్స్ 8 జీబీ ర్యామ్,128 జీబీ స్టోరేజ్; 8 జీబీ ర్యామ్,256 జీబీ స్టోరేజ్ మార్కెట్ లో అవైలబుల్ గా ఉన్నాయి.

Also Read: Hyderabad: ఇద్దరు కూతుళ్లకు నిద్రమాత్రలు ఇచ్చి చంపేసిన తండ్రి.. వెంటనే తానూ కూడా..!  

Also Read: World Cup 2023 Points Table: టాప్ ప్లేస్‌కు దూసుకువచ్చిన సఫారీ.. టీమిండియా ఎన్నో స్థానంలో ఉందంటే..?  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News