Samsung Users Alert: శామ్‌సంగ్ వినియోగదారులకు బిగ్‌ అలర్ట్.. వెంటనే మీ ఫోన్లను అప్‌డేట్ చేయండి.. లేకపోతే..!

Samsung Smartphones Updates: శామ్‌సంగ్ స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్. కేంద్ర ప్రభుత్వం నుంచి హై రిస్క్ హెచ్చరిక వచ్చింది. వెంటనే శామ్‌సంగ్ యూజర్స్ తమ ఫోన్లను అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది. మీ ఫోన్లను హ్యాకర్లు హ్యాక్ చేసి ఉండవచ్చని హెచ్చరించింది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 16, 2023, 03:55 PM IST
Samsung Users Alert: శామ్‌సంగ్ వినియోగదారులకు బిగ్‌ అలర్ట్.. వెంటనే మీ ఫోన్లను అప్‌డేట్ చేయండి.. లేకపోతే..!

Samsung Smartphones Updates: శామ్‌సంగ్ స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది. తమ స్మార్ట్‌ఫోన్‌లను వెంటనే అప్‌డేట్ సూచించింది. ఈ మేరకు శామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లను వినియోగిస్తున్న కోట్లాది మందికి ప్రభుత్వం నుంచి అలర్ట్ వచ్చింది. అయితే అందరూ యూజర్లకు ఈ హెచ్చరిక రాలేదు. మన దేశంలో శామ్‌సాంగ్ స్మార్ట్‌ఫోన్ వినియోగిస్తున్న కొంత మంది వినియోగదారుల కోసం ప్రభుత్వం ఈ హెచ్చరికను జారీ చేసింది. అలాంటి వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్‌లను వెంటనే అప్‌డేట్ చేయాలని కోరింది. 

సెక్యూరిటీ రిస్క్‌లను పేర్కొంటూ తమ స్మార్ట్‌ఫోన్‌లను అప్‌డేట్ చేయమని శామ్‌సంగ్ వినియోగదారులను కోరింది కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆఫ్ ఇండియా. ప్రస్తుతం ఆండ్రాయిడ్ 11, 12, 13 లేదా 14 వెర్షన్‌లో రన్ అవుతున్న ఫోన్‌లు శామ్‌సాంగ్ స్మార్ట్‌ఫోన్‌ల వినియోగదారుల కోసం ఈ హెచ్చరిక జారీ చేసింది. ఆండ్రాయిడ్ 11, 12, 13, 14లో రన్ అవుతున్న శామ్‌సంగ్ ఫోన్‌లలో కొన్ని సమస్యలు ఉన్నాయని.. దీని కారణంగా అటాకర్స్ మీకు తెలియకుండానే మీ ఫోన్‌ను హ్యాక్ చేసి ఉండవచ్చి వెల్లడించింది.

ఈ హెచ్చరికలను తేలిగ్గా తీసుకోవద్దని.. కచ్చితంగా అప్‌డేట్ చేసుకోవాలని కోరింది. మీరు ఆండ్రాయిడ్ వెర్షన్ 11 నుంచి 14 వరకు శామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ను కూడా వినియోగిస్తున్నట్లుయితే.. ఈ హెచ్చరికను అస్సలు లైట్ తీసుకోకూడదు. ఈ వినియోగదారులందరూ ప్రభుత్వ హెచ్చరికతో తమ స్మార్ట్‌ఫోన్‌లను అప్‌డేట్ చేయాలి. లేకపోతే మీ స్మార్ట్‌ఫోన్ నుంచి సున్నితమైన డేటా చోరీకి గురయ్యే ప్రమాదం ఉంది. హెచ్చరిక ప్రకారం.. సంబంధిత ఆండ్రాయిడ్ వెర్షన్‌తో కూడిన స్మార్ట్‌ఫోన్‌లలో కనిపించే లోపాల కారణంగా అటాకర్స్ వ్యక్తిగత డేటాను తీసుకుని.. టార్గెటెడ్ సిస్టమ్‌లో ఏకపక్ష కోడ్‌ని అమలు చేసే అవకాశం ఉంది. 

నాక్స్ ఫీచర్ యాక్సెస్ కంట్రోల్, ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్, ఏఆర్ ఎమోజీ యాప్‌లో ఆథరైజేషన్ సమస్య, మెమరీ కరప్షన్ వంటి అనేక తీవ్రమైన సమస్యలు తలెత్తుతాయి. అటాకర్స్ ముఖ్యంగా సిమ్ పిన్‌ను యాక్సెస్ చేయవచ్చు. ఏఆర్ ఎమోజీ శాండ్‌బాక్స్ డేటాను చదవవచ్చు. సిస్టమ్ సమయాన్ని మార్చవచ్చు. నాక్స్ గార్డ్ లాక్‌ని దాటవేయవచ్చు. ఫైల్‌లను యాక్సెస్ చేయవచ్చు.  

Also Read: ఈ సంవత్సరం అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాలు ఇవే.. మరీ ఇంత దారుణంగా..!

Also Read: CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి అనూహ్య నిర్ణయం.. ఆ ఇబ్బందులకు చెక్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News