Infinix Zero Ultra 5G: ఇన్‌ఫినిక్స్ స్మార్ట్‌ఫోన్ కెమేరా చూస్తే మతి పోవల్సిందే, 200 మెగాపిక్సెల్ కెమేరా అంటే మాటలా మరి

Infinix Zero Ultra 5G: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ ఇన్‌ఫినిక్స్ మరో అద్భుతమైన ఫోన్ లాంచ్ చేసింది. Infinix Zero Ultra 5G పేరుతో లాంచ్ అయిన ఈ ఫోన్ కెమేరా చూస్తే మతిపోవడం ఖాయం..ఆ వివరాలు మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 6, 2022, 09:29 PM IST
Infinix Zero Ultra 5G: ఇన్‌ఫినిక్స్ స్మార్ట్‌ఫోన్ కెమేరా చూస్తే మతి పోవల్సిందే, 200 మెగాపిక్సెల్ కెమేరా అంటే మాటలా మరి

Infinix Zero Ultra 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు, కెమేరా చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే. బ్యాటరీ అయితే మెరుపువేగంతో ఛార్జ్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో కెమేరా ఒక్కటే ఓ ప్రత్యేకత. ఏకంగా 200 మెగాపిక్సెల్ పవర్‌ఫుల్ కెమేరా ఉంది. దాంతోపాటు డిజైన్ కూడా అద్భుతమే. 

ఈ స్మార్ట్‌ఫోన్ ప్రపంచ మార్కెట్‌లో 42,400 రూపాయలకు లాంచ్ అయింది. ఇది మీడియాటెక్ హెలియా 920 చిప్‌సెట్‌తో 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ కలిగి ఉంది. ఇందులో 5జీబీ వర్చువల్ ర్యామ్ కూడా లభిస్తుంది. అంటే రెండూ కలిపితే 13 జీబీ వరకూ ర్యామ్ ఉన్నట్టే.

మరో ముఖ్యమైన ప్రత్యేకత ఈ ఫోన్ కెమేరా గురించి చెప్పుకోవాలి. ఇందులో ఏకంగా 200 మెగాపిక్సెల్ కెమేరా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో మొత్తం 3 రేర్ కెమేరాలున్నాయి. ఇందులో 200 మెగాపిక్సెల్ ప్రైమరీ లెన్స్‌తో పాటు 13 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ , 2 మెగాపిక్సెల్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీ కోసం 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమేరా మరో ప్రత్యేక ఆకర్షణ. ఇక బ్యాటరీ విషయానికొస్తే 4500 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం ఉంది. ఇందులో 180 వాట్స్ థండర్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉండటంతో కేవలం 12 నిమిషాల్లోనే ఛార్జ్ అయిపోతుంది. 

Also read: ATM With Draw Rules: ఏటీఎం నుంచి 4 సార్లు డబ్బులు తీస్తే..173 రూపాయలు కట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News