OPPO K12x Launch: ఒప్పో నుంచి కొత్త ఫోన్, అద్దిరిపోయే ఫీచర్లతో Oppo K12x 5G లాంచ్ కు సిద్ధం

OPPO K12x Launch: ప్రముఖ టెక్ దిగ్గజం చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ కంపెనీ ఒప్పో అద్దిరిపోయే ఫీచర్లతో అత్యంత స్టైలిష్ ఫోన్ లాంచ్ చేయనుంది. మార్కెట్లోని ఇతర స్మార్ట్ ఫోన్లకు కాస్త విభిన్నమైన ప్రత్యేకతలు ఈ ఫోన్ సొంతం. ఈ ఫోన్ లాంచ్ ఎప్పుడు, ఇతర వివరాలేంటనేది తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 23, 2024, 07:37 AM IST
OPPO K12x Launch: ఒప్పో నుంచి కొత్త ఫోన్, అద్దిరిపోయే ఫీచర్లతో Oppo K12x 5G లాంచ్ కు సిద్ధం

OPPO K12x Launch: ప్రముఖ స్మార్ట్ పోన్ దిగ్గజం ఒప్పోకు మంచి డిమాండ్ ఉంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త మోడల్స్ లాంచ్ చేస్తుండటం ఓ కారణమైతే, అద్భుతమైన కెమేరా, కొత్త కొత్త ఫీచర్లు కలిగి ఉండటం మరో కారణం. జూలై 30న ఒప్పో కొత్త మోడల్ ఇండియాలో లాంచ్ కానుంది. 

స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో చాలా కంపెనీలు ఉన్నా ఒప్పో స్థానం కాస్త ప్రత్యేకమే.ఇప్పుడు ఒప్పో నుంచి మరో కొత్త ఫోన్ మార్కెట్లో ప్రవేశించనుంది. OPPO K12x 5G ఫోన్ జూలై 30వ తేదీన భారతీయ మార్కెట్లో రానుంది. ఈ ఫోన్ 6.67 ఇంచెస్ హెచ్ డి ప్లస్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. అంతేకాకుండా 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నెట్స్ బ్రైట్ నెస్ తో ఉంటుంది.  45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయడమే కాకుండా అత్యధికంగా 5100 ఎంఏహెచ్ సామర్ధ్యంతో బ్యాటరీ ఉంటుంది.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత లింక్ బూస్ట్ టెక్నాలజీ ఉంది. అదే విధంగా నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి డీఆర్ఎం ప్రొటెక్టెడ్ యాప్స్ హెచ్ డి స్ట్రీమింగ్ కోసం ప్రత్యేకమైన ఎల్1 సర్టిఫికేషన్ ఉంటుంది. 

ఈ ఫోన్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ విషయంలో ఐపీ 54 రేటింగ్ మిలిటరీ గ్రేడ్ బాడీతో వస్తోంది. దాంతో నీళ్లలో ఎంత తడిసినా ఏం కాదు. ఇందులో ఉండే స్ప్లాష్ టెక్నాలజీ కారణంగా తడి చేతులతో ఫోన్ ఉపయోగించినా స్క్రీన్ యాక్సెస్ అవుతుంది. ఈ ఫోన్ కెమేరా, ర్యామ్ ఇతర వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. కానీ కెమేరా పరంగా చాలా అద్భుతంగా ఉండనుందని తెలుస్తోంది. ఈ ఫోన్ బ్రీజ్ బ్లూ, మిడ్ నైట్ వైలెట్ రంగుల్లో లభించనుంది.

Also read: DA Arrears: ఉద్యోగులకు బంపరాఫర్ డీఏ బకాయిలపై బడ్జెట్ లో ప్రకటన, పెద్ద మొత్తంలో డబ్బులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News