Realme Narzo 70 Price: రియల్‌ మీ నుంచి రూ.14 వేల లోపే మరో 2 మొబైల్‌ లాంచ్‌.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ చూడండి!

Realme Narzo 70 Price: అతి తక్కువ ధరలోనే మార్కెట్‌లోకి రియల్‌ మీ నుంచి మరో రెండు స్మార్ట్‌ఫోన్స్‌ లాంచ్‌ అయ్యాయి. ఇవి ప్రీమియం ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి విడుదలయ్యాయి. ఇవి Realme Narzo 70, Realme Narzo 70x మోడల్స్‌లో లభిస్తున్నాయి. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Apr 24, 2024, 02:44 PM IST
Realme Narzo 70 Price: రియల్‌ మీ నుంచి రూ.14 వేల లోపే మరో 2 మొబైల్‌ లాంచ్‌.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ చూడండి!

 

Realme Narzo 70 Price: అత్యంత చౌక ధరలోనే 5G స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ రియల్‌మీ మరో మిడ్‌ రేంజ్‌ మొబైల్‌ను మంగళవారం లాంచ్‌ చేసింది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. రియల్‌మీ ఈ మొబైల్‌ను NARZO 70 5G పేరుతో మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఇది ప్రస్తుతం అధికారిక రియల్‌మీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. అయితే అతి తక్కువ ధరలోనే మంచి మొబైల్‌ను కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది సరైన సమయంగా భావించవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌ విడుదల సందర్భంగా ప్రత్యేకమైన తగ్గింపుతో లభిస్తోంది. దీంతో పాటు రియల్‌మీ ఈ మొబైల్‌పై ప్రత్యేకమై కూపన్స్‌ను కూడా అందిస్తోంది. అయితే దీనిపై ఉన్న ఆఫర్స్‌ ఏంటో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి..

రియల్‌ మీ ఈ Realme Narzo 70 స్మార్ట్‌ఫోన్‌ అధికారిక వెబ్‌సైట్‌లో MRP ధర రూ.15,999లతో అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే దీనిని కొనుగోలు చేసే క్రమంలో రియల్‌మీ అందించే ప్రత్యేకమైన కూపన్స్‌ను వినియోగించే వారికి 6జిబి ర్యామ్‌, 128జిబి ఇంటర్నల్‌ స్టోరేజ్‌ కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్‌పై దాదాపు రూ.1,000 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో ఈ డిస్కౌంట్‌ ఆఫర్‌ పోను ఈ స్మార్ట్‌ఫోన్‌ కేవలం రూ.14,999కే పొందవచ్చు. అంతుకాకుండా ఈ మొబైల్‌పై ప్రత్యేకమైన రియల్‌మీ ప్రత్యేకమైన నో కాస్ట్‌ EMI ఆప్షన్‌ను కూడా అందిస్తోంది. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసే క్రమంలో బడ్స్‌ T110ను కొనుగోలు చేసేవారికి దాదాపు రూ.1,299కే లభిస్తోంది. ఇవే కాకుండా ఇతర ఆఫర్స్‌ కూడా లభిస్తోంది. 

అలాగే ఈ రియల్‌మీ వెబ్‌సైట్‌లో త్వరలోనే  Realme Narzo 70X మొబైల్‌ కూడా అందుబాటులోకి రాబోతోంది. ఇది కూడా ప్రత్యేకమైన తగ్గింపుతో అందించబోతున్నట్లు కంపెనీ వెల్లడించింది. దీనిని కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో కొనుగోలు చేసేవారికి దాదాపు రూ.1,500 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో పాటు ఈ మొబైల్‌పై కూడా ప్రత్యేకమై కూపన్‌ కూడా అందుబాటులోకి ఉంది. దీనిని వినియోగించి కొనుగోలు చేసేవారికి దాదాపు రూ.1,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో అన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను ఈ మొబైల్‌ కేవలం రూ. 10,000కే లభిస్తుంది. అలాగే ఈ మొబైల్‌పై కూడా ప్రత్యేకన ఇతర ఆఫర్స్ కూడా లభిస్తుంది. 

Realme Narzo 70 5G ఫీచర్స్‌:
6.67-అంగుళాల AMOLED డిస్‌ప్లే
HD ప్లస్ రిజల్యూషన్
240 Hz టచ్ శాంప్లింగ్ రేట్
1200 nits పీక్ బ్రైట్‌నెస్‌
ఆండ్రాయిడ్ 14 ఆధారిత రియల్‌మీ యూఐ 5.0 ఓఎస్‌
MediaTek Dimension 7050 5G ప్రాసెసర్‌
డ్యూయల్ రియర్ కెమెరా సెటప్
50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా
2 మెగాపిక్సెల్ సెకండరీ లెన్స్ కెమెరా
45W SuperVOOC ఛార్జింగ్ సపోర్ట్‌
5000 mAh బ్యాటరీ
518 గంటల స్టాండ్‌బై బ్యాటరీ
డ్యూయల్ స్టీరియో స్పీకర్‌
ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

Realme Narzo 70x 5G ఫీచర్స్‌:
6.62-అంగుళాల LCD డిస్‌ప్లే
HD ప్లస్ రిజల్యూషన్
120 Hz రిఫ్రెష్ రేట్ 
240 Hz టచ్ శాంప్లింగ్ రేట్‌
ఆండ్రాయిడ్ 14 ఆధారిత రియల్‌మీ యూఐ 5.0 ఓఎస్‌
MediaTek Dimension 6100+ 5G ప్రాసెసర్‌
డైనమిక్ ర్యామ్ ఫీచర్
50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా
2 మెగాపిక్సెల్ సెకండరీ లెన్స్
8 మెగాపిక్సెల్ కెమెరా
45W SuperVOOC ఛార్జింగ్ సపోర్ట్‌
5000 mAh బ్యాటరీ

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News