Realme Narzo 70 Pro: మనసు దోచే శక్తివంతమైన ఫీచర్స్‌తో Realme Narzo 70 Pro రాబోతోంది..ఫీచర్స్‌, ఇతర వివరాలు ఇవే!

Realme Narzo 70 Pro 5G Launch Date In India: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ రియల్ మీ త్వరలోనే Narzo 70 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేయబోతున్నట్లు ప్రకటించింది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 24, 2024, 10:23 AM IST
Realme Narzo 70 Pro: మనసు దోచే శక్తివంతమైన ఫీచర్స్‌తో Realme Narzo 70 Pro రాబోతోంది..ఫీచర్స్‌, ఇతర వివరాలు ఇవే!

 

Realme Narzo 70 Pro 5G Launch Date In India: ప్రముఖ టెక్‌ కంపెనీ రియల్‌మీ భారతీయ కస్టమర్స్‌కి త్వరలోనే గుడ్‌ న్యూస్‌ తెలపబోతోంది. అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న Realme Narzo 70 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ త్వరలోనే లాంచ్‌ చేయబోతున్నట్లు తెలిపింది. ఇప్పటికే ఈ మొబైల్‌ సంబంధించిన మైక్రోసైట్‌ ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. దీనిని కంపెనీ మార్చి మొదటి వారంలో విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. అయితే విడుదలకు ముందే ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అయితే ఈ Realme Narzo 70 Pro 5G స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

Realme Narzo 70 Proలో ప్రత్యేకత:
రియల్‌మీ ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన సమాచారాన్ని అధికారిక అమెజాన్‌ సైట్‌లో మైక్రోసైట్ ప్రత్యేక్ష ప్రసారం జరుగుతోంది. ఈ మొబైల్‌ శక్తివంతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. ఇది బ్యాక్‌ సెటప్‌లో OIS మద్దతుతో 50MP Sony IMX890 సెన్సార్‌ కలిగిన కెమెరాతో అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే అదనంగా ఈ మొబైల్‌  1/1.56 అంగుళాల సెన్సార్‌తో 50MP కెమెరాకు కూడా ఉండబోతున్నట్లు సమాచారం. ఈ మొబైల్‌ ఇంతకు మందు లాంచ్‌ చేసిన మోడల్స్‌కి ఆప్డేట్‌ వేరియంట్‌లో లాంచ్‌ కాబోతున్నట్లు తెలుస్తోంది. 

ఈ మొబైల్‌ ట్రిపుల్-రియర్ కెమెరా సెటప్‌తో అందుబాటులోకి రాబోతోంది. కాబట్టి  ఫ్లాట్ ఎడ్జ్ డిజైన్‌ను కలిగి ఉంటుందని మైక్రోసైట్‌లో వెల్లడించిన ఫోటోస్‌ ద్వారా తెలుస్తోంది. అంతేకాకుండా బ్యాక్‌ సెటప్‌లో రౌండ్ కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉండబోతున్నట్లు సమాచారం. దీనిని కంపెనీ మార్చి 6వ తేదిన లాంచ్‌ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ చూడడానికి Realme 12+ 5G మొబైల్‌ లాగా కనిపిస్తుంది.

Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?

కొత్త Narzo లోగో:
రియల్‌ మీ కంపెనీ త్వరలోనే విడుదల చేయబోయే Realme Narzo 70 Pro స్మార్ట్‌ఫోన్ సరికొత్త లోగోతో అందుబాటులోకి రానుంది. ఈ కంపెనీ సబ్‌ బ్రాండ్‌ నార్జోను కొత్త లోగోతో ఈ స్మార్ట్‌ఫోన్‌ ద్వారా పరిచయడం చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే రియల్‌ మీ కంపెనీ ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించలేదు. కానీ రియల్‌మీ అతి త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడించబోతున్నట్లు తెలుస్తోంది. 

Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News