Tecno Pop 8 Price: చీప్‌ అండ్‌ బెస్ట్‌ మొబైల్ వచ్చేసింది..రూ.5,999లోపే ప్రీమియం ఫీచర్స్‌ Tecno Pop 8 మొబైల్..

Tecno Pop 8 Price In India: అతి తక్కవ ధరలోనే మార్కెట్‌లోకి ప్రముఖ టెక్‌ కంపెనీ Tecno మరో స్మార్ట్‌ ఫోన్‌ విడుదల కాబోతోంది. అయితే ఈ స్మార్ట్‌ ఫోన్‌కి సంబంధించి ఫీచర్స్‌ను కంపెనీ ఇటీవలే విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ ఫోన్స్‌ సంబంధించి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 5, 2024, 09:20 AM IST
Tecno Pop 8 Price: చీప్‌ అండ్‌ బెస్ట్‌ మొబైల్ వచ్చేసింది..రూ.5,999లోపే ప్రీమియం ఫీచర్స్‌ Tecno Pop 8 మొబైల్..

 

tecno pop 8 price in india: ప్రస్తుతం మార్కెట్‌లో మార్కెట్‌లో బడ్జెట్‌ ధరల్లో లభించే స్మార్ట్‌ ఫోన్స్‌కి చాలా డిమాండ్‌ ఉంది. యువత ఎక్కువగా ప్రీమియం ఫీచర్స్‌ కలిగిన మొబైల్స్‌ను మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. అయితే వీటిని దృష్టిలో పెట్టుకుని Tecno కంపెనీ ఇటీవలే కొన్ని స్మార్ట్ ఫోన్స్‌ విడుదల చేసింది. ఈ మొబైల్స్‌ డెడ్‌ చీప్‌గా శక్తివంతమైన ఫీచర్స్‌తో లభించడంతో మార్కెట్‌లో ఈ కంపెనీ మంచి గుర్తింపు లభించింది. అయితే దీనిని దృష్టిలో పెట్టుకుని మర్కెట్‌లోకి మరో మొబైల్ లాంచ్‌ చేసింది. అయితే ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఫీచర్స్‌ ఏంటో, వీటికి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Tecno స్మార్ట్‌ ఫోన్‌ను టెక్నో పాప్ 8 మోడల్‌లో విడుదల చేసింది. అంతేకాకుండా కంపెనీ ఈ స్మార్ట్ ఫోన్‌నుకి సంబంధించిన ధరను కూడా వెల్లడించింది. 8జిబి ర్యామ్‌ వేరియంట్‌ కలిగిన ఈ స్మార్ట్ ఫోన్‌ ధర రూ.5,999 అందుబాటులో ఉంది. అయితే విడుదల సందర్భంగా ఈ స్పెషల్‌ ధరలో విక్రయించుతున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ మొబైల్‌ 5000mAh బ్యాటరీ, 90Hz డిస్ప్లేతో పాటు  అనేక ప్రత్యేక ఫీచర్లను కలిగి ఉంటుంది.

అమెజాన్‌లో విడుదల:
అమెజాన్‌లో Tecno Pop 8 స్మార్ట్‌ ఫోన్ కేవలం ఒకే (4GB + 64GB) వేరియంట్‌లో లభించనుంది. ఈ స్టోరేజ్ వేరియంట్ ధర MRP రూ.6,499 కాగా  అదనపు బ్యాంక్ ఆఫర్‌లో భాగంగా ఈ మొబైల్‌ కేవలం రూ.5,999కే అందుబాటులోకి వస్తుంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ జనవరి 9 నుంచి అందుబాటులో రాబోతున్నట్లు తెలుస్తోంది. 

Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం

టెక్నో పాప్ 8 స్పెసిఫికేషన్‌లు:
✾ 6.56 అంగుళాల HD + డాట్-ఇన్ IPS డిస్‌ప్లే
✾ 90Hz రిఫ్రెష్ రేట్‌
✾ nisoc T606 ఆక్టా కోర్ ప్రాసెసర్‌
✾ 8GB LPDDR4x RAM
✾ 64GB UFS 2.2 స్టోరేజ్‌
✾ డ్యూయల్ కెమెరా సెటప్
✾ 12MP డ్యూయల్ AI బ్యాక్‌ కెమెరా 
✾ 8MP AI సెల్ఫీ కెమెరా
✾ టైప్-సి కనెక్టివిటీ
✾ 10W అడాప్టర్‌
✾ 5000Mah Li-Po బ్యాటరీ
✾ 38 రోజుల వరకు స్టాండ్‌బై బ్యాటరీ

Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News