Vivo G2 Price: Vivo కంపెనీ స్మార్ట్ ఫోన్స్‌కి మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. దీనిని అలాగే కంటిన్యూ చేసేందుకు కంపెనీ మార్కెట్‌లోకి మరో మొబైల్‌ను విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ అతి తక్కువ బడ్జెట్‌లోనే ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. అయితే కంపెనీ ఈ స్మార్ట్ ఫోన్‌ను గత వారం చైనా మార్కెట్‌లోకి విడుదల చేసిన్నట్లు పేర్కొంది. ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Vivo G2 స్పెసిఫికేషన్స్:
Vivo G2 మొబైల్ 6.56 అంగుళాల LCD స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు ఈ డిస్ల్పే నాచ్‌తో కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ HD+ నాణ్యత 1612 x 720 పిక్సెల్స్, 90Hz రిఫ్రెష్ రేట్‌తో లభిస్తోంది. ఈ డిస్ల్పేను స్క్రోలింగ్, గేమింగ్‌ను సులభతరం చేసేందుకు రూపొందించారు. ఇది ఆండ్రాయిడ్ 13 వెర్షన్‌పై పని చేస్తుంది. ఇందులో ఆరిజిన్ OS 3 కూడా అందుబాటులో ఉంటుంది. సెల్ఫీ కోసం 5 మెగాపిక్సెల్ కెమెరా..బ్యాక్ సెట్‌లో 13 మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంటుంది..
Vivo G2 స్మార్ట్ ఫోన్ MediaTek డైమెన్సిటీ 6020 చిప్‌సెట్‌తో కంపెనీ పరిచయం చేసింది. ఈ మొబైల్ 8GB వరకు LPDDR4x RAMను కలిగి ఉంటుంది. ఈ మొబైల్ 256GB UFS 2.2 ఇంటర్నల్ స్టోరేజ్, ఎక్ట్రా స్టోరేజ్ కోసం మైక్రో SD కార్డ్ స్లాట్ కూడా అందుబాటులో ఉంది. దీంతో పాటు ఇది 15W ఛార్జర్‌తో అందుబాటులో ఉంది. ఫోన్ ఛార్జింగ్ కోసం USB-C పోర్ట్‌ను కలిగి ఉంటుంది. ఈ Vivo G2 స్మార్ట్ ఫోన్ డిజైన్, ఫీచర్స్ Vivo Y36i మొబైల్‌ను కలిగి ఉంటాయి.
Also Read Hacking తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు
Vivo G2 ధర వివరాలు:
ఈ Vivo G2 స్మార్ట్ ఫోన్ నాలుగు వేరియంట్‌లలో విడుదల కాబోతోంది. ఇది 4GB + 128GB ఇంటర్నల్ స్టోరేజ్, 6GB + 128GB, 8GB + 128GBతో పాటు 8GB + 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌లలో అందుబాటులో ఉంది. ఈ వేరియంట్‌ల ధరలు వరుసగా 1,199 యువాన్(భారత్‌లో రూ.14,174), 1,499 యువాన్ (రూ.17,720), 1,599 యువాన్ (రూ.18,902), 1,899 యువాన్ (రూ.22,449)తో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ ఫోన్‌ను కంపెనీ కేవలం డీప్ సీ బ్లాక్ కలర్స్‌లో విడుదల చేస్తుంది.
Also Read Hacking తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter