Munugode Result: తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారిన మునుగోడు ఉప ఎన్నిక ఫలితంపై తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. సీఎం కేసీఆర్ జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన తర్వాత జరిగిన తొలి ఎన్నిక కావడంతో జాతీయ రాజకీయాల్లో మునుగోడుపై చర్చ సాగుతోంది. మునుగోడు ఉప ఎన్నికలో రికార్డ్ స్థాయిలో 93 శాతానికి పైగా పోలింగ్ జరిగింది. ఓట్ల లెక్కింపునలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మునుగోడులో మొత్తం మొత్తం 2,41, 805 ఓట్లుండగా 2,25,192 ఓట్లు పోలయ్యాయి. 1,11,338 మంది , 1,13,853 మంది పరుషులు ఓటేశారు. 686 పోస్టల్ బ్యాలెట్ ఓట్ల పడ్డాయి. కౌంటింగ్ కోసం ఈసారి 21 టేబుళ్లు ఏర్పాటు చేశారు. గతంలో 14 టేబుల్స్ వేసేవారు. మునుగోడు ఓట్ల లెక్కింపులో మాత్రం 21 టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో రౌండ్ లో 24 పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎమ్ లను లెక్కించనున్నారు. నియోజకవర్గంలో మొత్తం 298 పోలింగ్ కేంద్రాలు ఉండగా... మొత్తం 15 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి కానుంది,
పోలింగ్ ముగియగానే ప్రధాన పార్టీలు ఓట్ల అంచనాల్లో పడ్డాయి. బూత్ ల వారీగా క్షేత్రస్థాయిలో వస్తున్న వివరాలను బట్టి తమకు పక్కాగా ఎన్ని ఓట్లు వస్తాయో లెక్క కడుతున్నారు. తమకు పోలయ్య ఓట్ల లెక్కలను పార్టీ పెద్దలకు పంపిస్తున్నారు స్థానిక లీడర్లు. అయితే మునుగోడు ఉప ఎన్నిక ఫలితంతో పాటు ఒక మూడు గ్రామాల ఫలితం ఇప్పుడు ఆసక్తిగా మారింది. మర్రిగూడెం మండలం లెంకలపల్లి, గట్టుప్పల్, మునుగోడు మండలం పలివెల గ్రామాల్లో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయన్నదానిపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ మూడు గ్రామాలకు ప్రత్యేకత ఉంది. లెంకలపల్లి గ్రామానికి ఎన్నికల ఇంచార్జ్ గా సీఎం కేసీఆర్ ఉన్నారు. గట్టుప్పల్ ఇంచార్జ్ గా మంత్రి కేటీఆర్ ఉన్నారు. ఇక పలివెల గ్రామం బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అత్తగారి ఊరు. ఈటలకు చెక్ పెట్టేందుకు పలివెలపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది గులాబీ పార్టీ. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఎన్నికల బాధ్యతలు అప్పగించింది. రెండు వారాల పాటు పలివెలలోనే మకాం వేశారు పల్లా.
కేసీఆర్ ఇంచార్జ్ గా ఉన్న మర్రిగూడెం మండలం లెంకలపల్లిలో మొత్తం 1927 మంది ఓటర్లు ఉండగా.. 1795 ఓట్లు పోలయ్యాయి. గట్టుప్పల్ లో 5 523 ఓటర్లకు గాను.. 5135 మంది ఓటు వేశారు. పలివెలలో 2104 మంది ఓటర్లు ఉండగా, 1952 మంది ఓటు వేశారు. ఈ మూడు గ్రామాలను అత్యంత సవాల్ గా తీసుకుంది అధికార పార్టీ. పోలింగ్ ముగిశాకా ఈమూడు గ్రామాలకు సంబంధించి సీఎం కేసీఆర్, కేటీఆర్ కు జిల్లా నేతలు నివేదిక ఇచ్చారని తెలుస్తోంది. లెంకలపల్లి, గట్టుప్పల్ తో పాటు పలివెలలో కారు గుర్తుకే మెజార్టీ ఓట్లు పడ్డాయని జిల్లా నేతలు చెప్పారని తెలుస్తోంది. దీంతో స్థానిక నేతలను సీఎం కేసీఆర్ అభినందించారని చెబుతున్నారు. పలివెల గ్రామంలో చివరి రోజు ప్రచారం సందర్భంగా బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. కర్రలు, రాళ్లతో కొట్టుకున్నారు. ఈ గొడవలో పలువురు గాయపడ్డారు.
Also Read : RC 16 కోసం భారీ ప్లాన్.. చేతులు కలిపిన సుకుమార్ అభిషేక్ అగర్వాల్
Also Read : Kartik Purnima 2022: కార్తీక పౌర్ణమి రోజు ఇలా చేస్తే అంతే సంగతి.. ఎందుకో తెలుసా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook