MUNUGODE RESULT: హుజారాబాద్ ఓటమితో షాకైన సీఎం కేసీఆర్ మునుగోడుపై స్పెషల్ ఫోకస్ చేస్తారని బీజేపీ ముందే తెలుసు. ఎలాగైనా గెలవడానికి తన పార్టీ యంత్రాంగం మొత్తాన్ని మునుగోడులోనే మోహరిస్తారని... ఎంత ఖర్చైనా వెనుకాడరని... అధికారాన్ని తనకు అనుకూలంగా మల్చుకుంటారని తెలుసు.
Munugode Result: మునుగోడు ఉప ఎన్నిక ఫలితంతో పాటు ఒక మూడు గ్రామాల ఫలితం ఇప్పుడు ఆసక్తిగా మారింది. మర్రిగూడెం మండలం లెంకలపల్లి, గట్టుప్పల్, మునుగోడు మండలం పలివెల గ్రామాల్లో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయన్నదానిపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.
Munugode Bypoll: తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతున్న మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం తారా స్థాయికి చేరింది. నామినేషన్లు వేసిన ప్రధాన పార్టీల అభ్యర్థులు పూర్తి స్థాయిలో ప్రచారంపై ఫోకస్ చేశారు. గ్రామాల వారీగా ఇంచార్జులుగా ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు.. అక్కడే మకాం వేసి ప్రచారం చేస్తున్నారు. దీంతో మునుగోడు నియోజకవర్గంలో ఎక్కడ చూసినా ఎన్నికల వాతావరణమే కనిపిస్తోంది.
Munugode Bypoll: మునుగోడు నియోజకవర్గంలో డబ్బులను విచ్చలవడిగా ఖర్చు చేస్తున్నారు. ఓటర్లను కొనుగోలు చేస్తున్నారు. ఎక్కడిక్కకడ ప్యాకేజీలు మాట్లాడుతూ గంపగుత్తగా కొనేస్తున్నారు. మునుగోడులో జరుగుతున్న పరిణామాలతో డబ్బులు ఎవరికి ఊరికే రావు... ఉప ఎన్నిక వస్తేనే వస్తాయి అంటూ కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
Munugode Bypoll: పార్టీల పోటీపోటీ వ్యూహాలతో మునుగోడు రాజకీయ సమీకరణలు రోజురోజుకు మారిపోతున్నాయి. ఇంతలోనే మునుగోడు సీన్ లోకి ఎంటరై ట్విస్ట్ ఇచ్చారు టీజేఎస్ అధినేత కోదండరామ్. టీజేఎస్ పోటీతో మునుగోడులో ఎవరికి లాభం, ఎవరికి నష్టం అన్న చర్చ కూడా సాగుతోంది
Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ రావడంతో టీఆర్ఎస్ అభ్యర్థిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ముందు నుంచి ప్రచారం జరుగుతున్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి ఇస్తారా లేక నియోజకవర్గంలో బీసీ ఓటర్లు ఎక్కువగా ఉండటంతో ఆ సామాజికవర్గం నేతను బరిలో నిలుపుతారా అన్నది ఆసక్తిగా మారింది.
Munugode Bypoll : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో జరగబోతున్న మునుగోడు ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలకం కానుంది. ఏడాదిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై దీని ప్రభావం ఉండనుంది. అందుకే ప్రధాన పార్టీలు బైపోల్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. తమ బలగాలను మొత్తం మునుగోడులోనే మోహరిస్తున్నాయి
Munugode By Election: అమిత్ షా సభతో మునుగోడులో బీజేపీలో జోష్ కనిపిస్తోందని తెలుస్తోంది. ఊహించిన దానికంటే అమిత్ షా సభ కు పెద్ద సంఖ్యలో జనం హాజరయ్యారని స్థానిక నేతలు చెబుతున్నారు.ముందు రోజు జరిగిన కేసీఆర్ సభ కంటే బీజేపీ సమరభేరీ సభకు జనాలు ఎక్కువగా వచ్చారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది
Munugode Bypoll: మునుగోడు.. మునుగోడు.. తెలంగాణ ఇప్పుడు ఎవరి నోట విన్నా ఇదే పేరు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో త్వరలో ఉప ఎన్నిక జరగనుండటంతో తెలంగాణలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. అన్ని పార్టీల నేతలు మునుగోడు చుట్టేస్తున్నారు.
Munugode Bypoll: మునుగోడు నియోజకవర్గంలో సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి.అధికార టీఆర్ఎస్ పార్టీలో కీలక పరిణమాలు జరుగుతున్నాయిని తెలుస్తోంది. అభ్యర్థి విషయంలో ట్విస్ట్ ఉండబోతుందని సమాచారం.కొన్ని రోజులుగా జరుగుతున్నపేరు కాకుండా కొత్త అభ్యర్థిని ఖరారు చేయనున్నారనే టాక్ వస్తోంది.
Munugode ByPoll: మునుగోడు ఉపఎన్నికలో అధికార పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. వారం రోజులుగా నియోజకవర్గంలోనే మకం వేసిన జగదీశ్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. గత నాలుగు రోజుల్లో ఆరుగురు సర్పంచ్ లు, ఐదుగురు ఎంపీటీసీలు కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ లో చేరారు. అయితే మంత్రి జగదీశ్ రెడ్డి ఎత్తులకు చెక్ పెట్టింది బీజేపీ. ఒకేసారి 10 మంది టీఆర్ఎస్ సర్పంచ్ లు కమలం గూటికి చేరారు. చండూరు మండలానికి చెందిన అధికార పార్టీ సర్పంచ్ లు మాజీ మంత్రి ఈటల రాజేందర్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు.
Munugode Byelection:కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు నియోజకవర్గానికి త్వరలో ఉప ఎన్నిక రాబోతోంది.గెలుపు కోసం పోటాపోటీ వ్యూహాలు రచిస్తున్న పార్టీల నేతలు.. ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు. ఉప ఎన్నికతో స్థానిక సంస్థల ప్రతినిధులకు పంట పండుతోందని తెలుస్తోంది.
Munugode Byelection: ఉప ఎన్నిక జరగబోతున్న నల్గొండ జిల్లా మునుగోడు నియోజవర్గంలో రాజకీయంగా సంచనాలు జరుగుతున్నాయి. ఇప్పటికే నియోజకవర్గంలో ముఖ్యనేతలను మోహరించింది అధికార టీఆర్ఎస్.తాజాగా హైదరాబాద్ వనస్థలిపురం లో చౌటుప్పల్ MPP తాడూరి వెంకటరెడ్డి ని పోలీసులు అరెస్ట్ చేసే ప్రయత్నం చేయడం కలకలం రేపుతోంది.
Munugode Byeelction:మునుగోడు నియోజకవర్గంలో అసమ్మతి అధికార పార్టీకి ముచ్చెమటలు పట్టిస్తోంది. మంత్రి జగదీశ్ రెడ్డి హెచ్చరించినా అసమ్మతి నేతలు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు.కూసుకుంట్ల టికెట్ ఇస్తే ఓడించి తీరుతామని ప్రకటనలు చేస్తున్నారు.
Munugode Byelection: తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారిన మునుగోడు ఉప ఎన్నికపై కాంగ్రెస్ దూకుడు పెంచింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా మునుగోడు నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం సాధించారు. ఆయన రాజీనామాతో తమ సిట్టింగ్ సీటును నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ అస్తశస్త్రాలు బయటికి తీస్తోంది
Munugode Byelection: తెలంగాణలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిన మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. పార్టీల పోటాపోటీ వ్యూహాలతో రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తోంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరనుండంతో ఆ పార్టీ అభ్యర్థిగా ఆయనే ఉండనున్నారు.
Munugode Byelection: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో నల్గొండ జిల్లా మునుగోడు అసెంబ్లీకి త్వరలో ఉప ఎన్నిక రాబోతోంది.అన్ని పార్టీలు మునుగోడు ఉప ఎన్నికపై ఫోకస్ చేశాయి.మునుగోడు నియోజకవర్గంలో వర్గపోరు తీవ్రంగా ఉందని గ్రహించిన కేసీఆర్ ఉప ఎన్నిక విషయంలో టెన్షన్ పడుతున్నారని అంటున్నారు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.