MLC Kavitha: నిజామాబాద్ ఎంపీగానే పోటీ చేస్తా.. అర్వింద్ ఎక్కడా నిలబడినా ఓడిస్తా..: ఎమ్మెల్సీ కవిత హాట్ కామెంట్స్

MLC Kavitha Comments on MP Dharmapuri Aravind: ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై ఎమ్మెల్సీ కవిత హాట్ కామెంట్స్ చేశారు. అర్వింద్ ఎక్కడ పోటీ చేసినా.. ఓడించి తీరుతామని స్పష్టం చేశారు. సీఎంకు సవాల్ విసిరే స్థాయి ఆయనది కాదన్నారు.   

Written by - Ashok Krindinti | Last Updated : Aug 10, 2023, 07:12 PM IST
MLC Kavitha: నిజామాబాద్ ఎంపీగానే పోటీ చేస్తా.. అర్వింద్ ఎక్కడా నిలబడినా ఓడిస్తా..: ఎమ్మెల్సీ కవిత హాట్ కామెంట్స్

MLC Kavitha Comments on MP Dharmapuri Aravind: వచ్చే ఎన్నికల్లో తాను నిజామాబాద్ ఎంపీగానే పోటీ చేస్తానని.. కచ్చితంగా గెలుస్తానని ఎమ్మెల్సీ కవిత ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే గణేష్ బిగాల, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్‌తో కలిసి బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కవిత మాట్లాడుతూ.. తెలంగాణలో అన్ని రంగాల్లో నూతన ఉత్తేజంతో  అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు. నిజామాబాద్  జిల్లా కూడా దీనికి మినహాయింపు కాదన్నారు. నిజామాబాద్  ఐటీ హబ్ గురించి ఎంపీ ధర్మపురి అర్వింద్ దారుణాతి దారణం గా మాట్లాడుతున్నారని.. అవాకులు చవాకులు మాట్లాడటం ఆయనకు అలవాటేనని అన్నారు.

గత పదేళ్లలో నిజామాబాద్ జిల్లాలో జరిగిన అభివృద్ధిలో బీజేపీ  భాగస్వామ్యం సున్నా అని కవిత ఎద్దేవా చేశారు. నిజామాబాద్ ఐటీ హబ్‌తో జిల్లా దశ దిశ మారబోతోందన్నారు. ఉద్యోగాల కల్పనపై అర్వింద్ మాట్లాడినవన్నీ అబద్దాలేనని అన్నారు. నిజామాబాద్ జిల్లాలో వేలాది కోట్ల రూపాయలతో పథకాలు చేపడుతున్నామని తెలిపారు. 

"నిజామాబాద్ అభివృద్ధిలో మీ పాత్ర ఏమిటి..? నేను నిజామాబాద్ ఎంపీగానే పోటీ చేస్తా.. గెలుస్తా.. అర్వింద్ కోరుట్ల ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు పారిపోతున్నాడు. కాళేశ్వరంపై బీజేపీ ఎంపీ తప్పుడు ప్రచారం చేశారు. మా ఎంపీలు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. బండి సంజయ్‌కు ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియదు. 24 గంటల కరెంట్‌ లేదంటున్న బండి సంజయ్ కరీంనగర్ బీజేపీ ఆఫీస్ కరెంటు స్విచ్‌లో వేలు పెట్టి చూడాలి. ముఖ్యమంత్రికి సవాల్ విసిరే స్థాయి అర్వింద్‌ది కాదు. ధర్మపురి అర్వింద్ నిజామాబాద్‌లో ఎక్కడ నిలబడిన కచ్చితంగా ఓడిస్తా.." అని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. 

ఆర్టీసీ చైర్మన్ బాజి రెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ.. పదేళ్ల కింద నిజామాబాద్ జిల్లా ఎట్లుండే ఇపుడు ఎలా ఉండే ప్రజలందరికీ తెలుసని అన్నారు. ఎమ్మెల్యేలుగా తాము నిత్యం ప్రజల్లోనే ఉంటున్నామని అన్నారు. నిజామాబాద్‌కు ఐటీ హబ్‌తో యువతకు ఉద్యోగ అవకాశాలు బాగా పెరుగుతాయన్నారు. అర్వింద్ ఎంపీగా గెలవడంతో నిజామాబాద్ ఇరవై యేండ్లు వెనక్కి పోయిందన్నారు. అర్వింద్ సోషల్ మీడియాలోనే ఎక్కువ ఉంటారని.. ఇపుడు గెలిచే పరిస్థితి లేదని డిపాజిట్ కూడా దక్కదని జోస్యం చెప్పారు. అర్వింద్  ఓ పని దొంగ అని.. పని చేసే తమను విమర్శించడం మానాలని హితవు పలికారు. రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్‌ను జైలుకు పంపుతానని.. ఆయనే జైలుకు వెళ్లారని అన్నారు. ఇప్పుడు  కేసీఆర్‌కు పిండం పెడతానని అంటున్నారు.. రేవంత్‌కే పిండం పెట్టడం ఖాయమన్నారు.

Also Read: Hyderabad Metro: మెట్రో రైల్ విస్తరణపై వేగంగా అడుగులు.. మాస్టర్ ప్లాన్‌పై మంత్రి కేటీఆర్ రివ్యూ  

Also Read: RBI Repo Rate: గుడ్‌న్యూస్ చెప్పిన ఆర్‌బీఐ.. రెపో రేటుపై కీలక నిర్ణయం  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News