హైదరాబాద్: తెలంగాణలో మొత్తం 17 లోక్ సభ స్థానాలకుగాను 8 స్థానాల్లో అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తూ కాంగ్రెస్ పార్టీ తొలి జాబితాను విడుదల చేసింది. మిగిలిన మరో 9 స్థానాలకు సంబంధించిన కాంగ్రెస్ జాబితాను నేడో రేపో విడుదల చేయనుంది. శుక్రవారం రాత్రి సోనియా గాంధీ నివాసంలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అధ్యక్షతన జరిగిన కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) సమావేశంలో అభ్యర్థుల ఎంపికపై చర్చించిన అనంతరం 8 మంది అభ్యర్థులపై ఓ అంతిమ నిర్ణయానికి వచ్చారు.
మల్కాజిగిరి నుంచి రేవంత్ రెడ్డి, ఆదిలాబాద్ నుంచి రమేష్ రాథోడ్ (ఎస్టీ), పెద్దపల్లి నుంచి ఎ చంద్రశేఖర్ (ఎస్సీ), కరీంనగర్ నుంచి పొన్నం ప్రభాకర్, జహీరాబాద్ నుంచి కె మదన్మోహన్ రావు, చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మెదక్ నుంచి గాలి అనిల్ కుమార్, మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్ (ఎస్టీ) అభ్యర్థులుగా ప్రకటించింది.
నేడో, రేపో ఖరారు కానున్న లోక్ సభ స్థానాలు:
1. హైదరాబాద్, 2. సికింద్రాబాద్, 3) నల్గొండ, 4) భువనగిరి 5) వరంగల్, 6) ఖమ్మం, 7) నిజామాబాద్, 8) మహబూబ్నగర్, 9) నాగర్కర్నూల్