Fire Accident: పంజాగుట్ట ఫ్లై ఓవ‌ర్ వ‌ద్ద అగ్ని ప్రమాదం, భారీగా ట్రాఫిక్ జామ్‌

Punjagutta Fire Accident: నిత్యం వాహనాలు, విద్యార్థులు, ఉద్యోగులతో రద్దీగా ఉండే పంజాగుట్ట ఫ్లై ఓవ‌ర్ వద్ద మ‌రోసారి అగ్ని ప్రమాదం సంభవించింది. ఫ్లై ఓవ‌ర్ పిల్లర్‌కు చేసిన ఫైబ‌ర్ డెక‌రేష‌న్‌కు మంట‌లు అంటుకున్నాయి.

Written by - Shankar Dukanam | Last Updated : Mar 16, 2021, 02:31 PM IST
  • హైద‌రాబాద్‌లో ర‌ద్దీగా ఉండే రోడ్డుపై అగ్ని ప్రమాదం
  • ఫ్లై ఓవ‌ర్ పిల్లర్‌కు చేసిన ఫైబ‌ర్ డెక‌రేష‌న్‌కు మంట‌లు
  • కాసేపు ఫ్లై ఓవర్ వద్ద ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది
Fire Accident: పంజాగుట్ట ఫ్లై ఓవ‌ర్ వ‌ద్ద అగ్ని ప్రమాదం, భారీగా ట్రాఫిక్ జామ్‌

Fire Breaks Out At Punjagutta Flyover | హైద‌రాబాద్‌లో ర‌ద్దీగా ఉండే రోడ్డుపై అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నిత్యం వాహనాలు, విద్యార్థులు, ఉద్యోగులతో రద్దీగా ఉండే పంజాగుట్ట ఫ్లై ఓవ‌ర్ వద్ద మ‌రోసారి అగ్ని ప్రమాదం సంభవించింది. ఫ్లై ఓవ‌ర్ పిల్లర్‌కు చేసిన ఫైబ‌ర్ డెక‌రేష‌న్‌కు మంట‌లు అంటుకున్నాయి. క్షణాల్లో మంటల నుంచి దట్టమైన పొగ ఆ ప్రాంతాన్ని కప్పేసింది. దీంతో కాసేపు ఫ్లై ఓవర్ వద్ద ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

ఒక్కసారిగా మంటలు రావడంతో వాహ‌న‌దారులు, స్థానికులు భ‌యాందోళ‌నల‌‌కు గుర‌య్యారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది అక్కడకు చేరుకుని మంట‌ల‌ను అదుపు చేయడానికి యత్నిస్తోంది. కాగా, మూడు రోజుల కిందటే పంజాగుట్ట ఫ్లై ఓవర్ కింద ఏర్పాటు చేసిన డెకరేషన్‌కు మంటలు అంటుకుని అగ్ని ప్రమాదం సంభవించడం తెలిసిందే. మరోసారి పంజాగుట్ట ఫ్లై ఓవ‌ర్ కింద అదే ప్రాంతంలో అగ్ని ప్రమాదం(Fire Accident) చోటుచేసుకోవడం అనుమానాలకు తావిస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Also Read: Income Tax Rules: ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న ఇన్‌కమ్ ట్యాక్స్ కొత్త రూల్స్ ఇవే 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News