GHMC Elections: జీహెచ్ఎంసీ ఎన్నికల బరిలో 1,122 మంది 

గ్రేటర్‌ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మొత్తం 150 స్థానాలకు 1,122 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ (TRS) ఒక్కటే 150 డివిజన్లలో తమ అభ్యర్థులను పోటీకి నిలిపింది.

Last Updated : Nov 24, 2020, 10:35 AM IST
  • గ్రేటర్‌ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల్లో మొత్తం 150 స్థానాలకు 1,122 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.
  • అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ (TRS) ఒక్కటే 150 డివిజన్లలో తమ అభ్యర్థులను పోటీకి నిలిపింది.
  • నవాబ్‌సాహెబ్‌ కుంటలో మినహా 149 డివిజన్లలో బీజేపీ (BJP), 146 డివిజన్లల్లో కాంగ్రెస్‌ (Congress) తమ అభ్యర్థులను రంగలోకి దింపాయి.
GHMC Elections: జీహెచ్ఎంసీ ఎన్నికల బరిలో 1,122 మంది 

Greater Hyderabad Elections 2020: హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ( GHMC ) ఎన్నికల్లో మొత్తం 150 స్థానాలకు 1,122 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ (TRS) ఒక్కటే 150 డివిజన్లలో తమ అభ్యర్థులను పోటీకి నిలిపింది. నవాబ్‌సాహెబ్‌ కుంటలో మినహా 149 డివిజన్లలో బీజేపీ (BJP), 146 డివిజన్లల్లో కాంగ్రెస్‌ (Congress) తమ అభ్యర్థులను రంగలోకి దింపాయి. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం ఒక్కో వార్డులో సగటున ఏడుగురు బరిలో నిలిచారు. అయితే ఎంఐఎం (MIM) తమకు పట్టున్న పాతబస్తీలో అభ్యర్థులను నిలుపగా, టీడీపీ పాతబస్తీ మినహా మిగిలిన డివిజన్లలో అభ్యర్థులను బరిలోకి దించింది. కమ్యూనిస్టు పార్టీలు కూడా తమ అభ్యర్థులను పోటీలో నిలిపాయి. దీంతోపాటు మొత్తం 415 మంది స్వతంత్ర అభ్యర్థులు ఈ ఎన్నికల్లో పోటీచేస్తున్నారు. Also read: Tarun Gogoi: అస్సాం మాజీ ముఖ్యమంత్రి గొగోయ్ కన్నుమూత

150 డివిజన్లకు పార్టీల వారీగా బరిలో నిలిచిన అభ్యర్థుల సంఖ్య..
టీఆర్ఎస్ - 150
బీజేపీ - 149
కాంగ్రెస్ - 146
ఎంఐఎం - 51
టీడీపీ - 106
సీపీఐ - 17
సీపీఎం - 12
స్వతంత్రులు - 415 మంది పోటీ పడుతున్నారు. 

అయితే హైదరాబాద్‌ ( Hyderabad ) లో అత్యధికంగా జంగమ్మెట్‌లో 20 మంది పోటీలో నిలవగా.. జీడిమెట్ల, టోలీచౌకీ, నవాబ్‌సాహెబ్‌కుంట, బార్కాస్‌, ఉప్పల్‌ డివిజన్లలో త్రిముఖ పోటీ జరగనుంది. మరికొన్ని చతుర్ముఖ పోటీ నెలకొంది. అయితే ఎక్కువ స్థానాల్లో బీజేపీ, టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ అభ్యర్థులే బరిలో నిలిచారు. Also read: Shanvi Srivastava: బికినీలో రెచ్చిపోయిన ‘లవ్లీ’ బ్యూటీ శాన్వీ

Also read: Covid-19 Vaccine: 70శాతం సమర్థవంతంగా ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G , Apple Link - https://apple.co/3loQYe.

మరిన్ని అప్‌డేట్స్ కోసం https://www.facebook.com/ZeeHindustanTelugu పేజీని లైక్ చేయండి, ట్విటర్‌లో https://twitter.com/ZeeHTelugu పేజీని ఫాలో అవండి

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x