తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ (టీ జాక్) ఛైర్మన్ ఎం.కోదండరామ్ త్వరలోనే కొత్త పార్టీ ప్రారంభించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇటీవలే ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ తాను త్వరలో పార్టీ ప్రారంభించే అవకాశం ఉందని తెలిపారు. టీఆర్‌ఎస్ పార్టీకి ప్రత్యమ్నాయంగా మరో పార్టీ రావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. టీ జాక్ ప్రస్తుతం ప్రజా పోరాటాలపైనే పనిచేస్తుందని.. కానీ అది రాజకీయ పార్టీగా ఎదగాల్సిన అవసరం ఉందని తాను కోరుతున్నట్లు కోదండరామ్ తెలియజేశారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు నిరంకుశవాదులను పోలి ఉందని.. ఆంధ్రా గుత్తేదార్లకు కాంట్రాక్టులు కట్టబెట్టడంలో తెలంగాణ పాలకుల వైఖరి, తెలంగాణ పోరాటంలో పాల్గొన్న వారి గొంతు నొక్కేసే విధంగా ఉందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.
కోదండరామ్ కొత్త పార్టీ ప్రారంభిస్తారా..?