Malla Reddy College: తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డికి చెందిన ఇంజనీరింగ్ కాలేజీలో ఉద్రిక్తత తలెత్తింది. మల్లారెడ్డి కళాశాలలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. MRCE మొదటి ఏడాది పరీక్షలు జరుగుతున్నాయి. అయితే విద్యార్థులకు ఉదయం పరీక్షకు హల్ టికెట్లు ఇవ్వలేదు యాజమాన్యం. దీంతో ఉదయం జరగాల్సిన పరీక్ష వాయిదా పడింది. మధ్యాహ్నం జరగాల్సిన పరీక్షకు కూడా హాల్ టికెట్లు ఇవ్వలేదు. హల్ టికెట్లు ఉంటేనే పరీక్షకు అనుమతిస్తామని సెంటర్ నిర్వాహకులు వెల్లడించారు. కాలేజీ వద్ద గంటల కొద్ది పడిగాపులు పడినా హాల్ టికెట్లు ఇవ్వకపోవడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు.
ఆగ్రహంతో బస్సులు, కళాశాల బిల్డింగ్ పై రాళ్లు రువ్వారు విద్యార్థులు. విద్యార్థుల దాడిలో పలు బస్సుల అద్దాలు పగిలిపోయాయి. విద్యార్థులు విధ్వంసానికి దిగడంతో మల్లారెడ్డి కాలేజీ క్యాంపస్ లో ఉద్రిక్తత తలెత్తింది. చాలా సేపటి వరకు విద్యార్థులు ఆందోళన చేశారు. కొందరు విద్యార్థులు కాలేజీకి లోపలికి వెళ్లి.. కార్యాలయ అద్దాలపై రాళ్లు విసిరారు. కాలేజీ యాజమాన్యం ఫిర్యాదుతో స్పాట్ కు వచ్చిన పోలీసులు.. విద్యార్థులను చెదరగొట్టారు.హాల్ టికెట్లు ఇవ్వకుండా తమను వేధిస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు.
READ ALSO: Jubilee Hills Gang Rape: జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్... సీబీఐ విచారణకు బండి సంజయ్ డిమాండ్...
READ ALSO: Gang Rape Update: మైనర్ బాలికపై ఎమ్మెల్యే కొడుకు అత్యాచారం! ఆధారాలు చూపించిన రఘునందన్ రావు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook