హైటెక్ సిటీలో పరుగులు పెట్టేందుకు సిద్ధమైన మెట్రో రైలు

                                  

Last Updated : Mar 19, 2019, 09:50 PM IST
హైటెక్ సిటీలో పరుగులు పెట్టేందుకు సిద్ధమైన మెట్రో రైలు

హైదరాబాద్ లో ఇప్పటికే పలు రూట్స్ లో పరుగులు పెడుతున్న మెట్రో రైలు ...ఇప్పడు సరికొత్త రూట్ లో సేవలు అందించేందుకు సిద్ధమైంది . అమీర్ పేట్-హైటెక్ సిటీ మెట్రోపనులు పూర్తవడం..ట్రయిల్ రన్స్ కూడా విజయవంతంగా పూర్తి చేసుకోవడం ఈ రూట్ మైట్రో రైలు నడిపేందుకు అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మెట్రో సేవలను ఎల్లుండి (ఈ నెల 20 ) నుంచి ప్రారంభించేందుకు ముహుర్తం ఫిక్స్ చేసుకున్నారు . బుధవారం 9.30 గంటలకు గవర్నర్ నరసింహన్ ప్రారంభించనున్నారు.

మాదాపూర్, హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లోని సాఫ్ట్ వేర్ సంస్థలతో పాటు ఇతర సంస్థల్లో ఉద్యోగులు అధిక సంఖ్యలో పనిచేస్తున్నారు. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో నివసిస్తున్న ఉద్యోగులు తమ కార్యాలయాలకు సకాంలో చేరుకునే విషయంలో ట్రాఫిక్ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండు రోజుల్లో ‘మెట్రో’ సేవలు అందుబాటులోకి రానుండటంతో ఉద్యోగుల కష్టాలు తీరనున్నాయి. ఈ మార్గంలో మెట్రో రైలు అందుబాటులోకి రావడం వల్ల ప్రయాణికులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి వస్తుంది.

Trending News