Kadium Counter: వరంగల్ జిల్లా టీఆర్ఎస్ పార్టీలో అసమ్మతి పీక్ స్టేజీకి చేరింది. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో ఇద్దరు మాజీ ఉప ముఖ్యమంత్రుల మధ్య మాటల యుద్దం కాక రేపుతోంది. తనపై ఎమ్మెల్యే రాజయ్య చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటరిచ్చారు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి. పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో చిల్లరగా మాట్లాడిన రాజయ్య ఆ వేదికను దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. ప్రజల మద్దతు కోల్పోయిన రాజయ్య.. తీవ్రమైన నిరాశ, నిస్పృహలో ఉన్నారని అన్నారు. అందుకే మతిస్థిమితం లేనట్లుగా పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని కడియం శ్రీహరి కౌంటరిచ్చారు.తనపై మాట్లాడిన మాటలను బేషరుతుగా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
నీ కంటే ముందు మూడుసార్లు ప్రాతినిధ్యం వహించిన.. నాపై తీవ్ర ఆరోపణలు చేస్తావా? అంటూ రాజయ్యపై విరుచుకుపడ్డారు కడియం శ్రీహరి. రాజయ్యకు ఎదైనా సమస్య ఉంటే అధిష్టానానికి చెప్పుకోవాలని సూచించారు.రాజయ్య గెలుపు కోసం గత రెండు ఎన్నికల్లో తాము కష్టపడ్డామని చెప్పారు. స్టేషన్ ఘనపూర్ ఎవరి అడ్డా, జాగీరు కాదన్న కడియం.. తనను ఎవరు అడ్డుకోలేరన్నారు. నాలుగు సార్లు గెలిచి రాజయ్య ఏం చేశారని ప్రశ్నించారు.రాజకీయాలలో ఉన్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని వార్నింగ్ ఇచ్చారు. భారతదేశంలో ఉపముఖ్యమంత్రిగా భర్తరఫ్ అయిన మొదటి వ్యక్తి రాజయ్యే అన్నారు కడియం శ్రీహరి. అవమానకర రీతిలో భర్తరఫ్ అయినప్పుడుస్టేషన్ ఘన్పూర్ పరుపు పోలేదా? అని నిలదీశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కడియం శ్రీహరికి ప్రత్యేక గుర్తింపు ఉందని చెప్పారు.
చిల్పూర్ మండలం చిన్నపెండ్యాలలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రాజయ్య.. కడియం శ్రీహరిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కడియం శ్రీహరి 361 మంది నక్సలెట్లను పొట్టన పెట్టుకున్నానారని ఆరోపించారు. కడియం శ్రీహరి మంత్రిగా ఉన్న సమయంలోనే ఈ హత్యలు జరిగాయన్నారు. ఒక్క స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోనే ఇంతమంది చనిపోయారని రాజయ్య అన్నారు. కేసీఆర్ తనకు దేవుడన్న ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య.. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గానికి తాను పూజారిని చెప్పారు. స్టేషన్ ఘనపూర్ తన అడ్డా అని ఇక్కడ ఎవరినీ అడుగుపెట్టనివ్వబోనని శపథం చేశారు. రాజయ్య చేసిన ఈ వ్యాఖ్యలపైనే తాజాకా కడియం శ్రీహరి కౌంటరిచ్చారు.
Read Also: Revanth Reddy: రేవంత్ రెడ్డిపై గురి పెట్టిన బీజేపీ.. బండి సంజయ్ స్కెచ్ మాములుగా లేదుగా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి