Political Leaders Tour: తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ సమరం ముగిసింది. ఇన్నాళ్లు మండటెండలో కూడా ప్రజల మధ్య తిరిగి ఓట్లు రాబట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఊపిరి సలపనంత బిజీబిజీగా గడిపిన నాయకులు పోలింగ్ ముగియడంతో హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు. పోలింగ్ ముగియగా.. ఎన్నికల ఫలితాలు జూన్ 4వ తేదీన వెలువడనున్నాయి. అంటే దాదాపు 20 రోజుల సమయం ఉంది. చాలా రోజుల సమయం ఉండడంతో నాయకులంతా తమ వ్యక్తిగత పనులు చేసుకోవడానికి సిద్ధమయ్యారు. ఎన్నికల హడావుడిలో పడి కుటుంబానికి దూరంగా ఉన్న నాయకులు ఈ గ్యాప్‌లో వ్యక్తిగత జీవితానికి పూర్తి సమయం కేటాయిస్తున్నారు. ఎంచక్కా దేశవిదేశాల్లో పర్యటించేందుకు ప్రణాళికలు వేసుకున్నారు. కొందరు నాయకులైతే ఇప్పటికే టూర్లకు వెళ్లారు. ఎన్నికల ఫలితాలకు రెండు మూడు రోజుల ముందు మళ్లీ స్వస్థలాలకు చేరుకునే అవకాశం ఉంది.
Also Read: YS Jagan Foreign Trip: సీఎం వైఎస్ జగన్‌కు శుభవార్త.. విదేశీ ప్రయాణానికి సీబీఐ కోర్టు పచ్చజెండా
ఫలితాలు వచ్చేలోపు కాస్త సేదతీరేందుకు వెళ్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో ఇప్పటికే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి కేరళ పర్యటనకు వెళ్లారు. అనూహ్యంగా ఎమ్మెల్యేలతో ఆయన ట్రిప్ వేయడం రాజకీయ వర్గాల్లో కలకలం ఏర్పడింది. అయితే రాజకీయ పర్యటననా? లేదా వ్యక్తిగత పర్యటన అనేది తేలాల్సి ఉంది. ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా వ్యక్తిగత పనుల్లో నిమగ్నమయ్యారు.
Also Read: K Laxman: ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉండదు.. ఆగస్టులో కుప్పకూలుతది
కొందరు విదేశాలకు వెళ్లేందుకు వెళ్తున్నారు. మరికొందరు దేశంలోని పర్యాటక ప్రాంతాలు, ఆలయాలు సందర్శించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కనీసం రెండు, మూడు వారాల పాటు తమను ఎవరూ సంప్రదించవచ్చని తమ అనుచరులు, అభిమానులకు సూచనలు చేసి మరి వెళ్తున్నారు. కొన్ని రోజుల పాటు తమను కలవడానికి కూడా ఎవరూ రావొద్దని ఆదేశిస్తున్నారు.
సీఎం జగన్ విదేశీ పర్యటన
ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇదే పరిస్థితి ఉంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులతోపాటు నాయకులు కూడా సేద తీరుతున్నారు. దేశ విదేశాలకు వెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబంతో సహా విదేశాలకు వెళ్తున్నారు. ఆయన విదేశీ పర్యటనకు నాంపల్లి సీబీఐ కోర్టు అనుమతినిచ్చింది. యూకే, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ దేశాలకు వెళ్లనున్నారు. అన్ని పార్టీల నాయకులు వ్యక్తిగత పర్యటనలు చేస్తున్నారు. బీజేపీ, జనసేన, టీడీపీ పార్టీ అధినేతలతోపాటు సామాన్య కార్యకర్తలు కూడా వ్యక్తిగత పనుల్లో బిజీ అయ్యారు.
అంతటా ప్రశాంతత
నాయకులు, కార్యకర్తల పట్టణాలతో హోరెత్తిన గ్రామాలు, పట్టణాల్లో కూడా ప్రశాంత వాతావరణం ఏర్పడింది. నాయకుల ప్రసంగాలు, పాటలతో నిత్యం రోత ఉండగా ఇప్పుడు ప్రశాంతత నెలకొంది. ప్రచార హడావుడి, మైకుల హోరు, రోడ్‌షోలు, ర్యాలీలు, సభలు, సమావేశాలతో హోరెత్తిన పల్లె, పట్టణాల్లో కొంత నిశ్శబ్ధ వాతావరణం ఏర్పడింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter
Leaders Tour: హమ్మయ్య టైమ్ దొరికింది.. దేశవిదేశాలకు చెక్కేస్తున్న పొలిటికల్ లీడర్లు