ప్రణయ్ కేసు: సోషల్ మీడియా కామెంట్స్ పై అమృత ఫిర్యాదు

                  

Updated: Oct 4, 2018, 06:09 PM IST
ప్రణయ్ కేసు: సోషల్ మీడియా కామెంట్స్ పై అమృత ఫిర్యాదు

మిర్యాలగూడ:  ప్రణయ్ హత్య తర్వాత అతని భార్య అమృత, కుటుంబ సభ్యులను కించపరిచేలా సోషల్ మీడియాలో పలు పోస్టులు వేస్తు కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని అమృత పోలీస్ స్టేషల్ లో ఫిర్యాదు చేసింది.

అమృత ఫిర్యాదు మేరకు మిర్యాలగూడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. తమను కించపరిచే విధంగా ప్రతి రోజు సోషల్ మీడియాలో పోస్టింగులు వస్తున్నాయన్న అమృత..అలాంటి అసత్య ప్రచారాలను ఆపాలని తాను ఎంతగా ప్రాధేయపడినా ఇప్పటి వరకు ఎలాంటి మార్పు లేదని ఆదేదన వ్యక్తం చేసింది. అమృత ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు..పూర్తి వివరాలతో ఫిర్యాదు చేస్తే పరిశీలించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు