Telangana Elections : సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా, భద్రత కోసం స్ట్రైకింగ్ ఫోర్స్ ఏర్పాటు

                  

Last Updated : Dec 6, 2018, 12:54 PM IST
Telangana Elections : సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా, భద్రత కోసం స్ట్రైకింగ్ ఫోర్స్ ఏర్పాటు

అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా 32,815 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో 4 వేల సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించగా..1500 ప్రాంతాలను అత్యంత సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించినట్లు తెలంగాణ అడిషనల్ డీజీపీ జితేందర్ వెల్లడించారు. పోలీసుల సమాచారం ప్రకారం సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక కేంద్ర బలగాలను మొహరించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో స్ట్రైకింగ్ ఫోర్స్ ..అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో హైపర్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఎన్నికల విధుల్లో పాల్గొననుంది.

సిసి కెమెరాలతో ప్రత్యేక నిఘా 

సమస్యాత్మక ప్రాంతాల్లో వీడియో రికార్డింగ్, సిసి కెమెరాలులతో పాటు మూడంచెల భద్రతను ఏర్పాట్లు చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద 144 సెక్షల అమలు చేయనున్నారు. ఎలాంటి ఘర్షణలు తలెత్తినా ఎదుర్కొనేలా వ్యూహరచనా చేశారు. 

మవో ప్రభావిత ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి పెట్టిన పోలీసు శాఖ... కేంద్ర బలగాలలో సగం నక్సల్ ప్రభావిత ప్రాంతాలకు మొహరించింది. జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెంలో ఎన్నికలు బహిష్కరించాలంటూ మావోయిస్టులు బ్యానర్లు, పోస్టుర్లు పెట్టడంతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర బలగాలలో సగం నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో విధులను నిర్వర్తించనున్నారు. ఈ  క్రమంలో సిర్పూరు, చెన్నూరు బెల్లంపలి,మంథని, మంచిర్యాల,ఆసీఫాబాద్, భూమాలపల్లి, ములుగు,పినపాక, ఇల్లెందు కొత్తగూడెం, అశ్వరావు పేట, భద్రాచలంలో ప్రతేక దృష్టి సారించారు. మావోయిస్టు ప్రభావితం ప్రాంతాల్లో ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారభమై.. సాయంత్రం 4 గంటలకు ముగియనుంది

Trending News