హైదరాబాద్ పోలింగ్ కోసం పగడ్భంధీ ప్లాన్ రెడీ

                   

Updated: Dec 6, 2018, 01:23 PM IST
హైదరాబాద్ పోలింగ్ కోసం పగడ్భంధీ ప్లాన్ రెడీ

హైదరాబాద్‌లో పోలింగ్ కోసం పగడ్భంధీ ఏర్పాట్లు చేశారు. జంటనగరాల పరిధిలో మొత్తం  3,873 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా..  వాటిలో 17 సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. సమస్యత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలతో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అంచానీయ ఘటనలపై నిఘా పెట్టేందుకు 60 శాడో టీంలు ఏర్పాటు చేశారు. ఎన్నికల నిబంధలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ అంజనీకుమార్ తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద వాహనాలు కలిపిస్తే సీజ్ చేస్తామన్నారు. కమిషనరేట్ పరిధిలో ఇప్పటి వరకు 4 వేల 586 ఆయుధాలు సరెండర్ చేశారని వెల్లడించారు. హైదరాబాద్ లో రికార్డు స్థాయిలో 25 కోట్ల నగదు పట్టుబడిందని ...అలాగే 4 లక్షల లీటర్ల మధ్యం స్వాధీనం చేసుకున్నట్లు సీపీ అంజనీ కుమార్ పేర్కొన్నారు. హైదరాబాద్ లో ఎన్నికలు నిర్వహించేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసినట్లు తెలిపారు

*  జంటనగరాల్లో మొత్తం 3,873 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు

*  17 సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తింపు

* పోలింగ్ కేంద్రాల్లో ఫోన్ కు అనుమతి లేదు

* లౌడ్ స్పీకర్లు వాడితే కఠిన చర్యలు

*  పోలింగ్ కేంద్రానికి100 మీటర్ల దూరంలో వాహనాలకు అనుమతి లేదు

*  నిఘా పెట్టేందుకు 60 శాడో టీంలు ఏర్పాటు