Telangana Exit Poll Results 2024:దేశ వ్యాప్తంగా 18వ లోక్ సభకు ఎన్నికలు జరిగాయి. అందులో భాగంగా తెలంగాణలో 4వ విడతలో భాగంగా ఎన్నికలు పూర్తయ్యాయి. ఈ రోజు చివరి విడత ఎన్నికలతో మొత్తం ఎన్నికల ప్రక్రియ పూర్తి అయింది. దీంతో పలు సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెల్లడించాయి. అందులో మెజారిటీ సర్వే సంస్థలు తెలంగాణలో రేవంత్ సర్కారుకు మోడీ దెబ్బ తగలడం ఖాయం అని చెబుతున్నాయి. మొత్తంగా తెలంగాణలో కాంగ్రెస్ కంటే భారతీయ జనతా పార్టీ ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందని చెబుతున్నాయి.
ముఖ్యంగా తెలంగాణలో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, సికింద్రాబాద్, జహీరాబాద్, మల్కాజ్ గిరి, మహబూబ్ నగర్ స్థానాల్లో బీజేపీ ఖచ్చితంగా గెలుస్తుందని పలు సర్వేలు ఘోషిస్తున్నాయి. మరోవైపు మెదక్, భువనగిరి స్థానాల్లో కాంగ్రెస్ పార్టీతో హోరాహోరిగా తలపడనుందని సమాచారం.
ఈ సారి తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ డబుల్ డిజిట్ లక్ష్యంగా పెట్టుకుని బరిలో దిగింది. అందుకు తగ్గట్టు కార్యాచరణ ప్రణాళిక రచించి రంగంలోకి దిగింది. ఈ సారి తెలంగాణ ఎన్నికల్లో అత్యధిక సీట్ల లక్ష్యంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇక్కడ 15కు పైగా ఎన్నికల ప్రచార సభలు.. రోడ్ షోలు నిర్వహించారు. మరోవైపు అయోధ్యలో రామ మందిర నిర్మాణం కూడా ఎన్నికల్లో ప్రభావం చూపించిందని చెబుతున్నారు. మరి ఎగ్జిట్ పోల్ చెప్పినట్టే మోదీ ప్రభంజనం తెలంగాణలో ఎలా ఉండబోతుందో తెలియాలంటే జూన్ 4 వరకు ఎన్నికల ఫలితాల వరకు వెయిట్ చేయాల్సిందే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter
Telangana Exit Poll Results 2024: రేవంత్ కు మోడీ దెబ్బ.. తెలంగాణలో బీజేపీ జోరు..