TRS MLAS BRIBE: ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో బిగ్ ట్విస్ట్.. మళ్లీ పోలీసుల అదుపులోకి నిందితులు

RS MLAS BRIBE:  నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో బిగ్ ట్విస్ట్. సైబరాబాద్ పోలీసులకు హైకోర్టులో ఊరట లభించింది. ముగ్గురు నిందితుల రిమాండ్ ను కొట్టివేస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసులో ప్రభుత్వ అప్పీల్ ను కోర్టు పరిగణలోనికి తీసుకుంది.

Written by - Srisailam | Last Updated : Oct 29, 2022, 01:03 PM IST
  • సైబరాబాద్ పోలీసులకు ఊరట
  • ఏసీబీ కోర్టు తీర్పు కొట్టివేత
  • సీపీ ముందు లొంగిపోనున్న నిందితులు
 TRS MLAS BRIBE: ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో బిగ్ ట్విస్ట్.. మళ్లీ పోలీసుల అదుపులోకి నిందితులు

TRS MLAS BRIBE:  నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో బిగ్ ట్విస్ట్. సైబరాబాద్ పోలీసులకు హైకోర్టులో ఊరట లభించింది. ముగ్గురు నిందితుల రిమాండ్ ను కొట్టివేస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసులో ప్రభుత్వ అప్పీల్ ను కోర్టు పరిగణలోనికి తీసుకుంది. ఏసీబీ కోర్టు రిమాండ్ రిజెక్ట్ ను డిస్మిస్ చేసింది. నిందితులు వివరాలు చెప్పడంలో విఫలమయ్యారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. నిందుతులను సైబరాబాద్ సీపీ ముందు హాజరుకావాలని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో ఈ కేసులో నిందితులుగా ఉన్న రామచంద్ర భారతి, సింహయాజులు, నందకుమార్ ను మళ్లీ అదుపులోనికి తీసుకోనున్నారు పోలీసులు. 24 గంటల లోగా కోర్టులో హాజరు పరచనున్నారు. అన్ని కేసుల్లో నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని... పోలీసులకు ఎప్పుడైనా అరెస్ట్ చేసే అధికారం ఉందని తెలిపింది.

టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఫాంహౌజ్ లో జరిగిన బేరసారాల కేసులో రామచంద్ర భారతీ, సింహయాజులు, నందకుమార్ ను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం ఏసీబీ కోర్టులో హాజరు పరచగా.. వాళ్ల రిమాండ్ ను కోర్టు తిరస్కరించింది. రూల్స్ పాటించలేదని తెలిపింది. ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పును సైబరాబాద్ పోలీసులు హైకోర్టులో సవాల్ చేశారు. ఏసీబి కోర్టు ఇచ్చిన తీర్పు ను రద్దు చేస్తూ నిందితులను రీమాండ్ తరలించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరింది. దీనిపై శనివారం విచారణ జరిగింది. కోర్టులో పోలీసుల తరపున ఏజీ వాదనలు వినిపించారు. హై ప్రొఫెషనల్ కేసులో 41 crpc నోటీసులు అవసరం లేదని వాదించారు. ఏ కేసులో అయినా రూల్స్ పాటించాల్సిందేనని నిందితుల కౌన్సిల్ తెలిపింది. ఇరు పక్షాల వాదనల అనంతరం హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది.

Also Read : Munugode Bypoll: జేపీ నడ్డా మునుగోడు బహిరంగ సభ రద్దు! ఫాంహౌజ్ డీలే కారణమా?

Also Read :  DMK Saidai Sadiq: కుష్బుకు డీఎంకే నేత క్షమాపణలు.. ఐటమ్స్ అంటూ చేసిన వ్యాఖ్యలపై వివరణ  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News