TS Inter Holidays 2024: ఇంటర్మీడియేట్‌ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. కాలేజీలకు సెలవులు..

TS Inter Holidays 2024: తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్‌ చెప్పింది. కాలేజీలకు వేసవి సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. ఇది తెలంగాణాలోని అన్ని జూనియర్, ఎయిడెడ్ ఇంటర్ కాలేజీలకు వర్తిస్తుంది.

Written by - Renuka Godugu | Last Updated : Mar 29, 2024, 08:08 AM IST
TS Inter Holidays 2024: ఇంటర్మీడియేట్‌ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. కాలేజీలకు సెలవులు..

TS Inter Holidays 2024: తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్‌ చెప్పింది. కాలేజీలకు వేసవి సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. ఇది తెలంగాణాలోని అన్ని జూనియర్, ఎయిడెడ్ ఇంటర్ కాలేజీలకు వర్తిస్తుంది. వేసవి కాలం విద్యార్థులకు ఇది చల్లని కబురు.

తెలంగాణ స్టేట్ బోర్డ్‌ ఆఫ్ ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ (TSBIE) ఇంటర్ కాలేజీలకు సెలవులు ప్రకటించింది. అన్ని ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు మార్చి 30 నుంచి సెలవులు ప్రకటించింది. దీంతో వీరికి దాదాపు రెండు నెలలపాటు వేసవి సెలవులు లభించాయి.

తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు వేసవి సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. ఈ సెలవులు మార్చి 30 నుంచి మే 31 వరకు అన్ని జూనియర్, ఎయిడెడ్ కాలేజీలకు సెలవులు ప్రకటించింది. ఇక కాలేజీలన్ని తిరిగి జూన్ 1న తెరుచుకోనున్నాయి.

ఇదీ చదవండి: Nita Ambani Visited Balkampet Temple: బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో నీతా అంబానీ ప్రత్యేక పూజలు..

ఇంటర్ బోర్డు షెడ్యూల్ ప్రకారం అన్ని ఇంటర్ కాలేజీల్లో అడ్మిషన్ల ప్రక్రియ కూడా మొదలు పెట్టునున్నట్లు ప్రకటించింది ఇంటర్ బోర్డు. ఇక ఇంటర్ ఫైనల్ ఇయర్ పరీక్షలు 2024 ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు నిర్వహించారు. ఈ పరీక్షలకు దాదాపు 9 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.

ఇదీ చదవండి: అంగరంగ వైభవంగా బర్రెలక్క రెండో వివాహం.. తరలివచ్చిన సోషల్‌ మీడియా అతిథులు

మొత్తం 4,78,000 పై చిలుకు మొదటి సంవత్సరం విద్యార్థులు ఉండగా, నాలుగు లక్షలకు పైగా ఇంటర్ రెండో సంవత్సరం విద్యార్థులు ఉన్నారు.ఇందులో ఈసారి 9,22,000 మందికి పైగా ఎగ్జామ్‌ ఫీజు చెల్లించారు. అయితే, ఇంటర్ ఫలితాలను నెల రోజుల తర్వాతే ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News