Sania Mirza: హైదరాబాద్ ఎన్నికల బరిలో సానియా మీర్జా..?.. కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మక అడుగులు..

Sania Mirza: కాంగ్రెస్ పార్టీ నుంచి హైదరాబాద్ స్థానానికి ఎంపీ అభ్యర్థిగా వింబూల్టన్ స్టార్ ప్లేయర్ సానియా మీర్జీ బరిలో ఉండనున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. సానియా అభ్యర్థిత్వం దాదాపు ఖరారైపోయినట్లు సమాచారం.

Written by - Inamdar Paresh | Last Updated : Mar 31, 2024, 10:26 PM IST
  • ఎన్నికల బరిలో సానియా మీర్జా..
  • దాదాపు అభ్యర్థిత్వం ఖరారైనట్లు సమాచారం..
Sania Mirza: హైదరాబాద్ ఎన్నికల బరిలో సానియా మీర్జా..?.. కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మక అడుగులు..

Sania Mirza Will Contesting From Congress Party Hyderbad Lok Sabha: లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో దేశంలో రాజకీయాలు హీట్ ను పుట్టిస్తున్నాయి. ఒకవైపు సమ్మర్ హీట్ జనాలకు చుక్కలు చూపిస్తుండగా, మరోవైపు రాజకీయాలు శరవేంగంగా మారిపోతున్నాయి. ఈ క్రమంలోనే  ఇప్పటికే రాజకీయాపార్టీలు తమదైన స్టైల్ లో ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఇక ఆయాపార్టీలు అభ్యర్థులు విషయంలో ఎంతో జాగ్రత్తగా పావులు వేస్తున్నాయి. గెలుపు గుర్రాలకు టికెట్ ఇచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇతర పార్టీలలోని నేతలకు కూడా టికెట్ల ఆశచూపి, పార్టీలలోకి ఆహ్వానిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో తెలంగాణ ఎంపీ ఎన్నికలలో మరోకీలక పరిణామం చోటు చేసుకుంది.

Read More: Snake Facts: పాముశరీరంలోని ఆ భాగం ఇంట్లో పెట్టుకుంటే డబ్బే డబ్బు..

తెలంగాణలో జంటనగరాలలో ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఇప్పటికే బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా..మాధవీలతకు టికెట్ ఖరారు చేసింది. ఎంఐఎం నుంచి అసదుద్దీన్ ఓవైసీలు బరిలో ఉన్నవిషయం తెలిసిందే. బీఆర్ఎస్ నుంచి గడ్డం శ్రీనివాస్ ఎంపీ ఎన్నికల బరిలో ఉన్నారు. అదే విధంగా సికింద్రాబాద్ నుంచి, బీజేపీ కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి పద్మారావు గౌడ్, కాంగ్రెస్  నుంచి దానం నాగేందర్ బరిలో ఉన్నారు.

ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ తాజాగా, హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా మాజీ వింబూల్టన్ స్టార్ సానియా మీర్జా పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో.. బుధవారం తెలంగాణ కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ జరగనుంది. సానియా పేరును, అజరుద్దీన్ ప్రతిపాదించినట్లు సమాచారం.

Read More: Teen Girl Romance: నడిరోడ్డు మీద రొమాన్స్.. ఇద్దరమ్మాయిలకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన పోలీసులు..

సానియా మీర్జా స్టార్ డమ్..తో ఎన్నికలలో, ఇటు బీజేపీతోపాటు బీఆర్ఎస్ కు కూడా చెక్ పెట్టే విధంగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలో కాంగ్రెస్ అధిష్టానం నుంచి మాత్రం క్లారీటీ రావాల్సి ఉంది. ఇదిలా ఉండగా సానియా ఇటీవల భర్త, షోయబ్ మాలీక్ తో వివాహాబంధానికి స్వస్తి చెప్పిన విషయం తెలిసిందే. దీంతో షోయబ్ మాలీక్ మరోక పెళ్లి చేసుకున్నారు. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

FacebookTwitterసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x