TS TET Hall Tickets 2024: తెలంగాణ టెట్ 2024 పరీక్ష హాల్ టికెట్లు విడుదల, ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

TS TET Hall Tickets 2024: ఏపీ, తెలంగాణల్లో ఎన్నికలు ముగియడంతోనే కోడ్ కూడా ముగిసింది. డీఎస్సీ, టెట్ వంటి పరీక్షలకు అనుమతి లభించింది. ఇవాళ్టి నుంచి తెలంగాణ టెట్ పరీక్ష రాసే అభ్యర్ధులు హాల్ టికెట్లను ఇలా tstet2024.aptonline.in.డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 15, 2024, 09:47 AM IST
TS TET Hall Tickets 2024: తెలంగాణ టెట్ 2024 పరీక్ష హాల్ టికెట్లు విడుదల, ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

TS TET Hall Tickets 2024: తెలంగాణలో టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2024 పరీక్ష హాల్‌టికెట్లు ఇవాళ విడుదలవుతున్నాయి. ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా పడిన తెలంగాణ టెట్ 2024 హాల్ టికెట్లను అభ్యర్ధులు tstet2024.aptonline.in. వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవల్సి ఉంటుంది. ఈ పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

తెలంగాణలో టెట్ పరీక్షలు తొలిసారిగా ఆన్‌లైన్ సీబీటీ విధానంలో జరగనున్నాయి. మే 20 నుంచి జూన్ 2 వరకూ ఉదయం, మద్యాహ్నం రెండు సెషన్లలో జరుగుతాయి. రాష్ట్రవ్యాప్తంగా టెట్ పరీక్షకు 2.86 లక్షలమంది దరఖాస్తు చేసుకోగా, 48,582 మంది సర్వీస్ టీచర్లు కూడా అప్లై చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 11 జిల్లాల్లో టెట్ పరీక్షా కేంద్రాలు ఏర్పాటయ్యాయి. విద్యాసంస్థల్లో ఉపాధ్యాయులుగా నియమితులు కావాలంటే టెట్ అర్హత సాధించాల్సి ఉంటుంది. టెట్ అర్హత సాధించినవారు మాత్రమే రిక్రూట్‌మెంట్ టెస్ట్ పరీక్ష రాయగలరు. పేపర్ 1 పరీక్షకు డీఈడీ ఉత్తీర్ణతతో పాటు జనరల్ అభ్యర్ధులు 50 శాతం, ఇతరులు 45 శాతం మార్కులతో ఇంటర్ పాస్ అయుండాలి. 2015 కంటే ముందు డీఈడీ పూర్తి చేసిన ఇతర కేటగరీ విద్యార్ధులకు 40 శాతం మార్కులుండాలి. పరీక్ష ఫీజు పేపర్‌కు 1000 రూపాయలుంది. జూన్ 12న టెట్ పరీక్ష ఫలితాలు విడుదల కానున్నాయి. 

టీఎస్ టెట్ 2024 పరీక్ష రాస్తున్న అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్ tstet2024.aptonline.in. క్లిక్ చేసిన సంబంధిత వివరాలు ఎంటర్ చేసి హాల్ టికెట్ పొందవచ్చు.  టెట్ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్ 150 మార్కులకు ఉంటుంది. పేపర్ 1 ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకూ జరుగుతుంది. ఇక పేపర్ 2 పరీక్ష అయితే మద్యాహ్నం 2 గంటల్నించి సాయంత్రం 4.30 గంటల వరకూ జరగనుంది. జనరల్ కేటగరీ విద్యార్ధులకు 90 మార్కులు, బీసీలకు 75, ఎస్సీ-ఎస్టీ-వికలాంగులకు 60 మార్కులు వస్తే అర్హత పొందుతారు. టెట్ మార్కులకు టీచర్ రిక్రూట్‌మెంట్‌లో 20 శాతం వెయిటేజ్ ఉంటుంది.

Also read: Revanth Reddy Chitchat: ఇక రాజకీయం ముగిసింది.. పరిపాలనపై దృష్టి సారిస్తా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News