1 నుంచి 9వ తరగతి పిల్లలకు వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదల

తెలంగాణలో 1 నుంచి 9వ తరగతి పిల్లలకు నిర్వహించనున్న వార్షిక పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను శనివారం ఎస్‌సీఈఆర్‌టీ (స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్) విభాగం విడుదల చేసింది

Last Updated : Jan 20, 2019, 02:32 PM IST
1 నుంచి 9వ తరగతి పిల్లలకు వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదల

హైదరాబాద్: తెలంగాణలో 1 నుంచి 9వ తరగతి పిల్లలకు నిర్వహించనున్న వార్షిక పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను శనివారం ఎస్‌సీఈఆర్‌టీ (స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్) విభాగం విడుదల చేసింది. 1-9వ తరగతి విద్యార్థులకు మార్చి 30 నుంచి ఏప్రిల్‌ 8 వరకు పరీక్షలు జరగనునుండగా రెండు రోజుల వ్యవధి అనంతరం ఏప్రిల్ 10న ఫలితాలు విడుదల కానున్నాయి. 

1-5వ తరగతి పరీక్షలు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, 
6-7వ తరగతి పరీక్షలు ఉదయం 10 నుంచి 12:45 గంటల వరకు, 
8-9వ తరగతుల పరీక్షలు మధ్యాహ్నం 2 నుంచి 4:45 గంటల వరకు జరగనున్నాయి.

ఇదిలావుంటే, ఫిబ్రవరి 15 నుంచి 27 వరకు 10వ తరగతి ప్రీఫైనల్‌ పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే.

Trending News