'పవిత్రబంధం' నటి ఝూన్సీ మృతి; వాట్సాప్ చాటింగ్ కీలక ఆధారం

వర్ధమాన సీరియల్ నటి ఝాన్సీ తుదిశ్వాస విడిచింది

Updated: Feb 6, 2019, 11:34 AM IST
'పవిత్రబంధం' నటి ఝూన్సీ మృతి; వాట్సాప్ చాటింగ్ కీలక ఆధారం

బుల్లితెర నటి ఝాన్సీ ఆత్మహత్య చేసుకుంది. ప్రముఖ మీడియా కథనం ప్రకారం హైదరాబాద్‌లోని శ్రీనగర్ కాలనీలో సాయి అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న ఆమె .. ఫ్యానుకు ఉరి వేసుకుంది. స్థానికులు సమాచారం మేరకు ఘటనా స్థాలానికి వచ్చిన పోలీసులు ఆమె మరణానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యుల స్టేట్ మెంట్ తీసుకున్నారు. అలాగే ఆమె సెల్‌ఫోన్‌ను సీజ్ చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. 

ప్రేమ వ్యహహారమేనా ?
వాట్సాప్ చాటింగ్ కీలక ఆధారంగా విచారణ కొనసాగుతోంది. ఓ యువకుడితో ఝాన్సీ వాట్సాప్ చాట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ప్రేమ వ్యవహారం వల్లే ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. దీంతో ఆమె మరణానికి గల కారణాన్ని చేధించేందుకు వాట్సాప్ డేటా కీలకంగా మారింది

పవిత్రబంధంతో గుర్తింపు...
బుల్లితెరపై పలు  సీరియల్స్ లో నటిస్తూ అంచెలంచెలుగుగా ఎదిగిన ఝాన్సీ.... 'పవిత్రబంధం' సీరియల్ తో ఝాన్సీ తెలుగు టీవీ ప్రేక్షకులకు చేరువైంది. ఆమె మరణంపై పలువురు టీవీ ప్రముఖులు, ఆర్టిస్టులు సంతాపం తెలిపారు.