Revanth Reddy Speech at Yatra for Change: “తెలంగాణ తెచ్చామని చెప్పుకుంటున్న కేసీఆర్‌కు రెండుసార్లు అవకాశం ఇచ్చారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌కు ఒక్కసారి అవకాశం ఇవ్వండి. తెలంగాణకు పూర్వ వైభవం, ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తాం” అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. యాత్ర ఫర్ ఛేంజ్ పాదయాత్రలో భాగంగా వరంగల్ ఈస్ట్ నియోజకవర్గంలో శరణ్య గార్డెన్స్ పెద్దమ్మ గడ్డ నుంచి వరంగల్ చౌరస్తా వరకు పాదయాత్ర నిర్వహించారు. ఎంజీఎం సర్కిల్ వద్ద రాజీవ్ గాంధీ విగ్రహానికి పూల మాల వేసి రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రారంభించారు.
అనంతరం వరంగల్ చౌరస్తాలో నిర్వహించిన జనసభలో ఆయన ప్రసంగించారు. పాదయాత్రలో ఎవరిని కలిసినా సంతోషంగా లేరని అన్నారు. తన మీద కోపంతో కొడంగల్‌ను అభివృద్ధి చేయలేదనుకున్నానని.. కానీ కొండా దంపతుల మీద కోపంతో వరంగల్‌ను కూడా అభివృద్ధి చేయలేదన్నారు. ఈ నగరాన్ని చెత్తకుప్పగా మార్చారని ఫైర్ అయ్యారు. ప్రపంచానికి మేధావులను అందించిన చరిత్ర కాకతీయ యూనివర్సిటీదని.. అలాంటి కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు లేవు, ప్రొఫెసర్లు లేని పరిస్థితి నెలకొందన్నారు.
వరంగల్లో ఏ ఎమ్మెల్యే అయినా ప్రజలకు అందుబాటులో ఉన్నారా..? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇక్కడ బీఆర్ఎస్ నేతలు భూములు ఆక్రమించుకుని దోచుకుంటున్నారని మండిపడ్డారు. అజాం జాహీ మిల్లు కార్మికులకు ఇవ్వాల్సిన భూమి ఈ ప్రభుత్వం పంపిణీ చేయలేదన్నారు. వరంగల్లో విలువైన భూములను ఆక్రమించుకొని వేల కోట్ల రూపాయాలు సంపాందించారని అన్నారు. కాంగ్రెస్ చేసిన అభివృద్ధి తప్ప వరంగల్లో ఈ తొమ్మిదేళ్లలో ఏ అభివృద్ధి జరగలేదన్నారు. రాష్ట్రంలో ఈ రావణకాష్టానికి పరిష్కారం లేదా..? అని అడిగారు. వరంగల్‌లో కొండా దంపతులను ఆశీర్వదించాలని కోరారు. వైఎస్ హయాంలో వారికి ఎలాంటి గౌరవం దక్కిందో.. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో అదే గౌరవం ఉంటుందన్నారు. 2024 జనవరి 1న కొత్త సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని జోస్యం చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి ఇళ్లు కట్టుకునే ప్రతీ పేదవాడికి రూ.5 లక్షల ఆర్థిక సాయం చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు. అదేవిధంగా ఆరోగ్యశ్రీ మార్జిన్‌ను 5 లక్షలకు పెంచుతామని తెలిపారు. ఆడబిడ్డలకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందిస్తామని ప్రకటించారు. ఆనాడు కాంగ్రెస్ రైతు బజార్లు తెరిస్తే.. కేసీఆర్ బెల్టు షాపులు తెరిచాడని విమర్శించారు.
Also Read: India Vs Australia: మూడో టెస్ట్‌కు పాట్ కమిన్స్ డౌట్.. ఆసీస్ కెప్టెన్ ఎవరంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook