Kamareddy Suicides: ఎస్సై, లేడీ కానిస్టేబుల్, ఆపరేటర్ సూసైడ్.. బైటికొచ్చిన షాకింగ్ వాస్తవాలు..!.. ఎస్సై భార్యకు ముందే తెలుసా..?

Kamareddy deaths: ఎస్సై, లేడీ కానిస్టేబుల్ తో పాటు, ఆపరేటర్ ఆత్మహత్యల ఘటన తెలంగాణలో పెను సంచలనంగా మారింది. దీనిపై పోలీసులు సీరియస్ గా విచారణ చేస్తున్నట్లు తెలుస్తొంది.  

Written by - Inamdar Paresh | Last Updated : Dec 27, 2024, 07:37 PM IST
  • ఆత్మహత్యల మిస్టరీ..
  • వెలుగులోకి వస్తున్న విస్తుపోయే విషయాలు..
Kamareddy Suicides: ఎస్సై, లేడీ కానిస్టేబుల్, ఆపరేటర్ సూసైడ్.. బైటికొచ్చిన షాకింగ్ వాస్తవాలు..!.. ఎస్సై భార్యకు ముందే తెలుసా..?

Kamareddy si and lady constable operation suicides: కామారెడ్డిలో చోటు చేసుకున్న ఘటన ప్రస్తుతం తెలంగాణ పోలీసు శాఖలో తీవ్ర కలకలంగా మారినట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో ఇటీవల బిక్కనూన్ ఎస్సై సాయి కుమార్, బీబీపేట పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న శృతి, బీబీపేటలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న నిఖిల్ ముగ్గురు అడ్డూర్ లోని ఎల్లారెడ్డి పెద్ద చెరువులోకి దూరి ఆత్మహత్యలకు పాల్పడ్డారు. దీనిపై పోలీసులు లోతుగా విచారిస్తున్నట్లు తెలుస్తొంది. ఈ ముగ్గురి ఆత్మహత్య వెనుక ట్రయాంగిల్ లవ్ ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది.

మొదట లేడీ కానీస్టేబుల్ .. ఎస్సైతో ఎఫైర్ పెట్టుకుందని..ఇటీవల ఆయన వేరేచోటకు ట్రాన్స్ ఫర్ కావడంతో.. మరొ కంప్యూటర్ ఆపరేటర్ తో చనువుగా ఉంటున్నట్లు తెలుస్తొంది. ఇది కాస్త సాయి కుమార్ కు తెలియడంతో వీరి మధ్య గొడవలు జరిగినట్లు తెలుస్తొంది.  అయితే.. శృతికి ఆమె భర్తతో డైవర్స్ అయ్యాయి.. ఎస్సై  సాయికుమార్ కు ఒక సంతానం ఉండగా... ప్రస్తుతం ఆయన భార్య ప్రెగ్నెంట్ అని తెలుస్తొంది. ఈ నేపథ్యంలో వీరి మధ్య గొడవలు జరిగి.. తొలుత మాట్లాడుకుందామని.. చెరువు దగ్గరకు వెళ్లినట్లు తెలుస్తొంది.

అక్కడ వాగ్వాదం జరిగి.. తొలుత శృతి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడగా.. మరల.. ఎస్సై, నిఖిల్ కూడా చెరువులో దూరినట్లు తెలుస్తొంది. వీరి వ్యవహారం మాత్రం.. పెద్ద దుమారంగామారింది. పోలీసులు ఇప్పటికే వీరి వాట్సాప్ డాటాను, కాల్స్ లిస్ట్ ను సేకరించినట్లు వార్తలు వస్తున్నాయి. వీరి సూసైడ్ కు ముందు గంటల కొద్ది ఫోన్స్, వాట్సాప్ చాట్ లను పోలీసులు గుర్తించారంట.  అయితే.. ఎస్సై భార్యకు ఇప్పటికే ఈ ఎఫైర్ గురించి తెలుసని.. పద్దతి మార్చుకొవాలని చెప్పిందని కూడా ప్రచారం జరుగుతుంది.

Read more: Konda Surekha: కొండా సురేఖ మరో సంచలనం.. తిరుమల ఆలయంపై షాకింగ్ కామెంట్స్.. ఏమన్నారంటే..?

ఈ క్రమంలో  మాట్లాడుకుందామని వెళ్లిన వాళ్లు.. ఈ గొడవ ఎక్కడికి దారితీస్తుందో అని ఒత్తిడితో.. తొలుత శృతిచెరువులో దూకగా.. ఆమెను కాపాడటానికి వీరిద్దరు కూడా చెరువులో దూకి ఉంటారని ప్రచారం జరుగుతుంది. మొత్తానికి వీరి వ్యవహారం మాత్రం తెలంగాణ పోలీసు శాఖలో తీవ్ర కలవరంపెట్టేదిగా మారినట్లు చెప్పవచ్చు. పోలీసులు మాత్రం దీనిపై లోతుగా విచారణ జరుపుతున్నట్లు తెలుస్తొంది. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Trending News