Konda Surekha: కొండా సురేఖ మరో సంచలనం.. తిరుమల ఆలయంపై షాకింగ్ కామెంట్స్.. ఏమన్నారంటే..?

Tirumala Temple: తెలంగాణ మంత్రి కొండా సురేఖ తిరుమల శ్రీవారిపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కాకరేపుతున్నాయి. దీనిపై వెంటనే చర్యలు తీసుకొవాలని కూడా శ్రీవారి  భక్తులు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తొంది.  

Written by - Inamdar Paresh | Last Updated : Dec 27, 2024, 12:30 PM IST
  • మళ్లీ నోరుపారేసుకున్న కొండా సురేఖ..
  • ఆగ్రహాం వ్యక్తం చేస్తున్న శ్రీవారి భక్తులు..
Konda Surekha: కొండా సురేఖ మరో సంచలనం.. తిరుమల ఆలయంపై షాకింగ్ కామెంట్స్.. ఏమన్నారంటే..?

Minister Konda Surekha shocking comments on Tirumala: కొన్నిరోజులుగా తిరుమల తరుచుగా వివాదస్పద అంశాలతో  వార్తలలో ఉంటుందని చెప్పుకొవచ్చు. కూటమి సర్కారు ఏర్పడిన తర్వాత తిరుమలలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టారు. తిరుమలకు పూర్వవైభవం దిశగా చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా.. ఇటీవల టీటీడీ కొత్త చైర్మన్, పాలక మండలిని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. టీటీడీకీ చైర్మన్ గా బీఆర్ నాయుడును నియమించారు. ఆయన చైర్మన్ గా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి అనేక విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తొంది.

మెయిన్ గా కూటమిసర్కారు ఆదేశాల ప్రకారం.. సాధారణ భక్తులకు పెద్దపీట వేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తొంది. ముఖ్యంగా గంటలోనే శ్రీవారి దర్శనం, వసతులు, అన్న ప్రసాదంలు, నడక మార్గంలో ఎక్కడ కూడా ఇబ్బందులు కల్గకుండా అనేక చర్యలు తీసుకుంటున్నారు. అయితే.. ఇదే క్రమంలో టీటీడీ చైర్మన్ ఇప్పటికే తిరుమలలో రాజకీయాలకు చోటు లేదని, శ్రీవారి మాడవీధుల్లో స్వామివారి పవిత్రతను భంగం కల్గజేసే ఎలాంటి చర్యలపై అయిన కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టంచేశారు.

ఇటీవల తెలంగాణ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తిరుమలలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణకు కూడా ఆదేశించినట్లు తెలుస్తొంది. తాజాగా, తెలంగాణ దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తన కుటుంబంతో కలిసి.. శ్రీశైలంను దర్శించుకున్నారు. ఈ క్రమంలో తిరుమలపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వార్తలలో నిలిచాయి.

తిరుమలకు.. తెలంగాణ నుంచి అధికంగా భక్తులు వస్తుంటారని అన్నారు. అదే విధంగా.. తమ స్టేట్ నుంచే తిరుమలకు అధికంగా ఆదాయం చేకూరుతుందని మాట్లాడినట్లు తెలుస్తొంది. శ్రీశైలం భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామిని దర్శించుకున్నాక ఈ వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం.

గతంలో సమైక్యంగా ఉన్నప్పుడు.. శ్రీశైలం మా గుడిగా ఉండేదని, ఇప్పుడు స్టేట్స్  విడిపోవడం వలన శ్రీశైలాన్ని కోల్పోయామన్నారు. తిరుమలలో..  తెలంగాణ భక్తులు  నిర్లక్ష్యానికి గురవుతున్నారన్నారు. గతంలో తిరుమలలో పద్ధతులు, నియమాలు ఉండేవి. తెలంగాణలో టీటీడీ, వెంకటేశ్వర స్వామి వారి ఆలయల డెవ్ లప్ మెంట్ లకు ప్రత్యేక చొరవ చూపించేవారని.. కానీ  ఇప్పుడు అలా చేయడం లేదని మంత్రి కొండా సురేఖ అన్నారు.

Read more: TTD: తిరుమలలో ఇక నో క్యూ లైన్ వెయిటింగ్, గంటలోనే దర్శనం

ఇప్పటికైన ఏపీ ప్రభుత్వం, టీటీడీ ప్రత్యేంగా చొరవతీసుకుని, టీటీడీ కళ్యాణ మండపాలు, వెంకటేశ్వర స్వామి వారి ఆలయాల డెవ్ లప్ మెంట్ లకు ముందుకు వచ్చి నిధులు కేటాయించాలన్నారు. ప్రస్తుతం కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా మళ్లీ దుమారంగా మారాయి. దీనిపై చర్యలు తీసుకొవాలని శ్రీవారి భక్తులు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తొంది..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x