Mahesh Babu Daughter: సూపర్‌స్టార్ కృష్ణ సతీమణి, మహేశ్ బాబు తల్లి ఇందిరా దేవి బుధవారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. ఇందిరాకు తుది నివాళి అర్పించేందుకు సినీ, రాజకీయ ప్రముఖులు పద్మాలయ స్టూడియోకు తరలివస్తున్నారు. ఇక నాన్నమ్మ పార్థివదేహాన్ని చూసి సూపర్ స్టార్ మహేశ్ బాబు కుమార్తె 'సితార మహేష్' తట్టుకోలేకపోయారు. మహేశ్ బాబు ఒడిలో కూర్చొని కన్నీటి పర్యంతమయ్యారు. మహేష్ ఓదార్చినా కూడా సితార తన దుఃఖాన్ని ఆపుకోలేకపోయారు.