Cv anand reveals sritej health condition: పుష్ప2 మూవీకి తెలంగాణ సర్కారు బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే.. ఈ ఘటనలో.. డిసెంబర్ 4న షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. దిల్ సుఖ్ నగర్ నుంచి తన కుటుంబంతో కలిసి సరదాగా సినిమా చూసేందుకు.. రేవతి అనే మహిళ వచ్చింది. అప్పుడు ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ నేపథ్యంలో రేవతి తొక్కిసలాటలో.. ఊపిరాడక చనిపోయిన విషయం తెలిసిందే.
Comissioner of Police CV Anand visits Sai Teja who is getting treated in the Sandhya Theater Stampede incident.
Now announces that the govt is going to take care all the expenses of the treatment!
So far, @alluarjun has taken care of every single… pic.twitter.com/LnyZ5yJef7
— Revathi (@revathitweets) December 17, 2024
ఆమె కొడుకు శ్రీతేజ్ ను మొదట దుర్గాబాయ్ దేశ్ ముఖ్ కు తరలించారు. అక్కడ చికిత్స అందించారు. తాజాగా.. బాలుడ్ని కిమ్స్ కు తరలించినట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఈ ఘటనపై అల్లు అర్జున్ తో పాటు.. సంధ్య థియేటర్ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు . ఈ కేసులో.. ఏ11గా ఉన్న అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు. అనేక నాటకీయ పరిణామల తర్వాత తెలంగాణ హైకోర్టు మాత్రం మధ్యంతర బెయిల్ ను ఇచ్చిన విషయం తెలసిందే. గతంలోనే అల్లు అర్జున్ రేవతి కుటుంబానికి సారీ చెబుతు వీడియోలను విడుదల చేశారు. ఆ కుటుంబానికి 25 లకలు ప్రకటించారు.
అరెస్ట్ నుంచి బెయిల్ వచ్చాక కూడా.. ఆ కుటుంబాన్ని కలవాలని అనుకుంటున్నట్లు చెప్పారు. కానీ కేసు కోర్టు పరిధిలో ఉన్న క్రమంలో కలవకూడదని న్యాయనిపుణులు చెప్పారని అన్నారు. అయితే.. అల్లు అర్జున్ టీమ్ మాత్రం.. శ్రీతేజ్ కుటుంబంతో టచ్ లో ఉన్నామని, వైద్యఖర్చులు భరిస్తున్నామని కూడా చెప్పినట్లు తెలుస్తొంది. అంతే కాకుండా.. ఇటీవల సింగపూర్ నుంచి నాలుగు లక్షల రూపాయల కాస్లీ ఇంజెక్షన్ సైతం తెప్పించినట్లు వార్తలు వచ్చాయి.
అయితే.. తాజాగా.. హైదరబాద్ సీపీ సీవీ ఆనంద్ శ్రీతేజ్ ను పరామర్శించినట్లు తెలుస్తొంది. ఆ తర్వాత ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. శ్రీతేజ్ ఆరోగ్యం కాస్త సీరియస్ గా ఉందని.. వైద్యులు మాత్రం చాలా తీవ్రంగా కష్టపడుతున్నారని అన్నారు. శ్రీతేజ్ బ్రెయిన్ డ్యామెజ్ అయిందని అన్నారు. బాలుడి ఆస్పత్రి ఖర్చులన్ని రేవంత్ సర్కారు భరిస్తుందని చెప్పినట్లు తెలుస్తొంది. దీంతో ఒక్కసారిగా ఈ ఘటన వార్తలలొ నిలిచింది.
Read more: Allu Arjun: అల్లు అర్జున్‌కు బిగ్ షాక్.. బెయిల్ ఆర్డర్ రద్దుకు మరో పిటిషన్..?..
ఇన్నిరోజులు అల్లు అర్జున్ టీమ్ .. బాలుడి ఆస్పత్రి ఖర్చులు భరిస్తున్నామని.. ఇంజెక్షన్ తెప్పించామని చెప్పినవన్ని అబద్దాలేనా.. అంటూ కొంత మంది సోషల్ మీడీయాలో అల్లు అర్జున్ ను ఏకీపారేస్తున్నారంట. ఇలాంటి పరిస్థితుల్లో అబద్దాలు చెప్పేందుకు నోరు ఎలా వస్తుందని కొందరు మండిపడుతున్నారంట.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter