పాక్ కోర్టు సంచలన తీర్పు: మాజీ ప్రధానికి ఏడేళ్ల జైలు శిక్ష

పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీప్ ఇస్లామాబాద్ న్యాయస్థానం మరో షాక్ ఇచ్చింది

Last Updated : Dec 24, 2018, 04:41 PM IST
పాక్ కోర్టు సంచలన తీర్పు: మాజీ ప్రధానికి ఏడేళ్ల జైలు శిక్ష

పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ విషయంలో ఆ దేశ న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. పాక్ మీడియా కథనం ప్రకారం నిధులు మళ్లీంపు, అవినీతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నవాజ్ షరీఫ్ కు ఇస్లామాబాద్ కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది.  సౌదీ అరేబియాలోని స్టీల్ మిల్ ఓనర్ షిప్ కేసులో ఈ శిక్షను ఖరారు చేసింది. దీనికి సంబంధించి పెట్టుబడుల వివరాలు, ఆదాయ వనరులను షరీఫ్ చూపించలేక పోయారని న్యాయ స్థానం పేర్కొంది. 

జూలై 10న ఇదే కోర్టు షరీఫ్ కు 10 ఏళ్ల జైలు శిక్షను విధించింది. లండన్ లో ఖరీదైన భవంతుల కొనుగోలు వ్యవహారంలో ఈ శిక్షను ఖరారు చేసింది. ఇప్పుడు అదే కోర్టు షరీఫ్ కు మళ్లీ షాకిచ్చింది. అయితే ఈ రెండు కేసుల్లో పడిన శిక్షను ఏకకాలంలో అమలౌతాయా ..లేదంటే విడివిడిగా అమలౌతాయనే అనే విషయం తేలాల్సి ఉంది. ఇప్పటికే నవాజ్ షరీష్ కు 68 ఏళ్ళు ఉన్నాయి. ఈ శిక్షలు అమలైతే ఆయన జీవితకాలం జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది

Trending News