భారత్ పట్ల విషం కక్కుతూ దుందుడుకు చర్యలకు పాల్పడుతున్న పాక్ బుద్ది చేప్పేందుకు మోడీ సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ చర్యలో భాగంగా పాకిస్థాన్ వెన్నువిరిచే వ్యూహానికి భారత్ పదును పెడుతోంది. సముద్ర తీరాల్లో జరిగే యుద్ధాల్లో కీలక పాత్ర పోషించే సబ్మెరైన్ల జాడను పాక్ పసిగట్టకుండా పి-3సీపై భారత్ దృష్టి పెట్టింది. జపాన్ తో కలిసి ఈ విన్యాసానాలకు చేపట్టింది. భారత్ చేపట్టిన ఈ విన్యాసాలతో పాక్ కు వణుకుపుడుతోంది.
సముద్ర తీరాల్లో జరిగే యుద్ధాల్లో కీలక పాత్ర పోషించే అత్యుత్తమ స్థాయి సబ్మెరైన్లను భారత్ ఎప్పుడో సమకూర్చుకుంది. అయితే.. వాటిని గుర్తించి ధ్వంసం చేసే అమెరికాలోకి లాక్‌హీడ్ మార్టీన్ నుంచి పి-3సీ విమానాన్ని 1996లో పాకిస్థాన్ కొనుగోలు చేసింది. పాక్ రక్షణ దశం ఈ విమానాలను ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ చేయిస్తూ వస్తోంది. ఈ విమానాలకు సమాచారం అందకుండా సబ్మెరైన్లను అప్‌గ్రేడ్ చేసుకునే పనిలో పడింది భారత్. పాక్ వద్ద ఉన్న పి-3సీలోని వ్యవస్థల పనితీరు తెలుసుకుని దానికి తగినట్లు సబ్మెరైన్ల సంచారాన్ని మార్చుకోవాలని భారత నేవీప్లాన్ వేసింది. జపాన్‌తో కలిసి సంయుక్త దీనికి సంబంధించిన యుద్ధ విన్యాసాలు చేసింది. జపాన్ కూడా పి-3సీ నిఘా విమానాలను వినియోగిస్తుండడంతో యుద్ధ విన్యాసాల్లో భాగంగా వాటిని భారత సిబ్బంది కూడా వినియోగిస్తారు.
తాజా విన్యాసాలతో పి-3సీపై భారత సిబ్బందికి పట్టువచ్చింది. ఈ విమానాలు గోవాలోని ఐఎన్ఎస్ దళం హంసాకి చేరుకున్నాయి. భారత్ తరపున పీ-8ఐ నిఘా విమానాలు ఈ విన్యాసాల్లో పాలు పంచుకున్నాయి. భారత సబ్మెరైన్ల కదలికలను పాక్ కనిపెట్టకుండా చేసేలా భారత నావికాదళం చర్యలు తీసుకుంటోంది. భారత్ అనుసరిస్తన్న వ్యహానికి ఎలా చెక్ పెట్టాలో తెలియక తికమకపడుతోంది పాక్...