మోడీ సర్కార్ తీరును సమర్థించినందుకు రాహుల్ పై పాక్ విమర్శలు

పాక్ ను హింసను ప్రేరేపించే దేశం అని సంభోదించినందుకు  రాహుల్ గాంధీని పాక్ సర్కార్ టార్గెట్ చేస్తూ విమర్శలు సంధించింది

Last Updated : Aug 28, 2019, 03:51 PM IST
మోడీ సర్కార్ తీరును సమర్థించినందుకు రాహుల్ పై పాక్ విమర్శలు

ప్రతి విషయంలో మోడీ సర్కార్ తీరును విమర్శించే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కశ్మీర్ విషయంలో మోడీ సర్కార్ ను సమర్ధించారు. ట్విట్టర్ వేదికగా రాహుల్ స్పందిస్తూ ప్రతిపక్ష పార్టీగా తాను మోడీ సర్కార్ తీరు చాలా విషయాల్లో ఎండగట్టానని... కశ్మీర్ విషయానికి వస్తే తమ స్టాండ్ చాలా క్లియర్ గా ఉందన్నారు. ఇది తమ దేశ అంతర్గత వ్యవహారమని..ఇందులో పాక్ తో సహా ఏ ప్రపంచంలోని ఏ దేశం కూడా వేలు పెట్టేందుకు అవకాశం ఇవ్వబోమంటూ పాక్ విషయంలో మోడీ సర్కార్ అనుసరిస్తున్న తీరును  రాహుల్ ఇలా పరోక్షంగా సమర్ధించారు. 

ఇదే సందర్భంలో రాహుల్ మరోక ట్వీట్ చేస్తూ జమ్మూ కశ్మీర్ లో చెలరేగుతున్న హింసకు కారణం ముమ్మాటికి పాకిస్తాన్ దేశమే.  ఇందులో ఎలాంటి సందేహం లేదు... పాక్ ప్రేరణతోనే అక్కడ హింస చెలరేగుతోంది. హింసను పెంచిపోషించడంలో పాకిస్థాన్ ఎలాంటి దేశమో ప్రపంచదేశాలకు తెలుసు అని రాహుల్ ఇమ్రాన్ సర్కార్ పై విమర్శలు సంధించారు.

పాక్ కు ఉగ్రవాదం మరకలు అంటిస్తూ రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ పై ఇమ్రాన్ సర్కార్ వెంటనే స్పందించింది.  పాక్ మంత్రి ఫవాద్ హున్సేన్ చౌదరీ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ సెక్యూరల్ స్టాండ్ విషయంలో తమ ముత్తాత అయిన నెహ్రు తరహాలో దృఢంగా నిలబడాలని రాహుల్ గాంధీకి హితవు పలికారు. మీ  రాజనీతిలో  గందరగోళం ఉందని రాహుల్  గాంధీని ఉద్దేశించి ఫవాద్ హున్సేన్ ఎద్దేవ చేశారు. ఇలా రాహుల్ వైఖరిపై పాకిస్తాన్ మంత్రి  వ్యంగ్యంగా స్పందించడం గమనార్హం. ఇదిలా ఉంటే పాక్ కామెంట్స్ ను కాంగ్రెస్ పార్టీ  తీవ్రంగా ఖండించింది

Trending News