క్రికెట్‌‌ను అసలు ఆటే కాదన్న దేశం.. నివ్వెరపోయిన ప్రపంచం

క్రికెట్ అసలు ఆటే కాదన్న దేశం.. నివ్వెరపోయిన ప్రపంచం

Last Updated : Jul 21, 2019, 06:08 PM IST
క్రికెట్‌‌ను అసలు ఆటే కాదన్న దేశం.. నివ్వెరపోయిన ప్రపంచం

క్రికెట్ అంటే పడిచచ్చే అభిమానులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. అందుకే ఐసిసి వరల్డ్ కప్‌కి ప్రపంచవ్యాప్తంగా అంత ఆధరణ ఉంది. ఇటీవల ముగిసిన ఐసిసి వరల్డ్ కప్ కి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ లభించిందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా సచిన్ టెండుల్కర్ లాంటి క్రికెట్ దిగ్గజాలను దేవుళ్లుగా భావించే దేశాలూ ఉన్నాయి. అయితే, అంత గొప్ప ఆధరణ కలిగిన క్రికెట్ ను అసలు తాము ఆటగానే భావించడం లేదని రష్యా ప్రకటించింది. రష్యన్ మీడియా సంస్థ ఆర్‌టి వెల్లడించిన ఓ కథనం ప్రకారం క్రికెట్‌ను అధికారిక క్రీడగా పరిగణించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ దాఖలైన వినతిని తిరస్కరిస్తూ రష్యా మంత్రిత్వ శాఖ ఈ ప్రకటన చేసినట్టు తెలుస్తోంది. మాస్కో క్రికెట్ ఫెడరేషన్ సభ్యుడు అలెగ్జాండర్ సోకోరిన్ ఈ వివరాలను వెల్లడించినట్టు ఆ వార్తా కథనం పేర్కొంది. పలు సాంకేతిక కారణాలతోనే క్రికెట్‌ను ఆటగా భావించడం లేదని రష్యా క్రీడా మంత్రిత్వ శాఖ వివరణ ఇచ్చినట్టు సమాచారం.

అయితే, మరో ఏడాదిలోగా రష్యాలో క్రికెట్‌ను అధికారిక్ క్రీడగా పరిగణించేలా అన్నివిధాల సిద్ధం చేసి మరోసారి ప్రభుత్వానికి దరఖాస్తు చేస్తామని అలెగ్జాండర్ సోకోరిన్ తెలిపారు. ఫుట్ గోల్ఫ్, స్పోర్ట్స్ యోగా, మోడల్ ప్లేన్ ఫ్లైయింగ్ వంటి ఆటలను అధికారిక క్రీడలుగా పరిగణించే రష్యాలో ప్రపంచం మెచ్చిన క్రికెట్‌ను ఆటగా చూడకపోవడం ఏంటని క్రికెట్ ప్రియులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Trending News