విజయ్ మాల్యాకు మొదటిసారి షాక్ ఇచ్చిన బ్రిటన్ హైకోర్టు

విజయ్‌ మాల్యాకు బ్రిటన్‌ హైకోర్టు షాక్ 

Last Updated : Jun 16, 2018, 09:18 PM IST
విజయ్ మాల్యాకు మొదటిసారి షాక్ ఇచ్చిన బ్రిటన్ హైకోర్టు

భారత్‌లో వివిధ బ్యాంకుల వద్ద వేల కోట్ల రుణాలు తీసుకుని, చివరకు తీసుకున్న రుణం తిరిగి చెల్లించకుండా లండన్‌కు పారిపోయిన రుణ ఎగవేతదారుడు, లిక్కర్ వ్యాపార దిగ్గజం విజయ్‌ మాల్యాకు బ్రిటన్‌ హైకోర్టు మొదటిసారిగా షాకిచ్చింది. తమ రుణాలను రాబట్టేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని 13 భారతీయ బ్యాంకులు చేస్తోన్న న్యాయపోరాటం ఖర్చుల కింద ఆయా బ్యాంకులకు కనీసం 2 లక్షల పౌండ్లు (రూ.1.80 కోట్లు) చెల్లించాలని బ్రిటన్ హై కోర్టు విజయ్ మాల్యాను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి ఆండ్రూ హెన్షా మాల్యాకు ఆదేశాలు జారీచేశారు. 

ఇదిలావుంటే, మరోవైపు విజయ్ మాల్యా ఆస్తులను జప్తు చేసేందుకు సంబంధించిన వరల్డ్‌వైడ్ ఆర్డర్‌ను న్యాయమూర్తి ఆండ్రూ హెన్షా గత నెలలోనే తిరస్కరించిన సంగతి తెలిసిందే. మాల్యాపై న్యాయ పోరాటం చేస్తోన్న బ్యాంకుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, కార్పొరేషన్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ లిమిటెడ్, ఐడీబీఐ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, యూకో బ్యాంక్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, జెఎం ఫైనాన్షియల్ అసెట్ రికన్‌స్ట్రక్షన్ కంపెనీ ప్రై.లి వంటి బ్యాంకింగ్ సంస్థలు ఉన్నాయి.

Trending News