2017 సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్లో అవినీతి నిరోధక శాఖ సాధించిన విజయాలపై డీజీపీ ఆర్.పి.ఠాకూర్ ఓ ప్రకటన విడుదల చేశారు. అందులోని ముఖ్య వివరాలివి
* 2017లో ఆంధ్రప్రదేశ్లో 67 మందిపై అక్రమాస్తుల కేసులు నమోదు కాగా.. అందులో 44 మందికి శిక్షలు విధించారు.
* అదేవిధంగా, ఈ సంవత్సరమే రాష్ట్రంలో అవినీతి తగ్గుదలపై ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సిఫార్సులు చేసేందుకు ప్రత్యేక నియంత్రణ విభాగాన్ని ఏర్పాటు చేశారు
* నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రిసెర్చి సంస్థ అధ్యయనం ప్రకారం 2017లో అవినీతి తగ్గుముఖం పడుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో నిలిచింది.
*2016లో అవినీతి తగ్గుముఖం పడుతున్న రాష్ట్రాల్లో 19వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2017లో మూడవ స్థానాన్ని కైవసం చేసుకోవడం విశేషం
*ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్న కేసుల్లో పట్టుబడే ప్రభుత్వ అధికారుల ఆస్తులను కూడా జప్తు చేయడానికి ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చారు.