High court CJ on Amaravati : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై (Amaravati) వాదనల సందర్భంగా హైకోర్టు సీజే ప్రశాంత్ కుమార్ మిశ్రా కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి రాజధాని కోసం 30 వేల మంది రైతులు స్వచ్చందంగా భూములు ఇచ్చారని గుర్తుచేశారు. అమరావతి కేవలం రైతుల రాజధాని కాదని...ఆంధ్రప్రదేశ్‌కు (Andhra Pradesh) రాజధాని అని స్పష్టం చేశారు. రాజధాని అమరావతి... విశాఖపట్నం,కర్నూల్ సహా ఏపీ ప్రజలందరిది అని పేర్కొన్నారు. ఆనాడు స్వాతంత్య్ర సమరయోధులు కేవలం తమ కోసమే పోరాటం చేయలేదని... దేశ ప్రజలందరి కోసం పోరాడారని గుర్తుచేశారు.
ఏపీలో వైసీపీ (YSRCP) ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాలనా వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానులను ప్రకటించిన సంగతి తెలిసిందే. విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్, అమరావతిలో లెజిస్లేటివ్ కేపిటల్, కర్నూలును జ్యుడీషియల్ కేపిటల్‌గా ప్రకటించారు. అయితే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో 57 పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో ప్రభుత్వం ఈ విషయంలో ముందడుగు వేయలేకపోతోంది. ఈ పిటిషన్లన్నింటిపై ఈ నెల 15 నుంచి హైకోర్టులో (High court) రెగ్యులర్ విచారణ జరుగుతోంది.
తొలిరోజు విచారణ సందర్భంగా విచారణ బెంచ్ నుంచి జస్టిస్ సోమయాజులు, జస్టిస్ సత్యనారాయణను తొలగించాలని ఏపీ ప్రభుత్వం తరుపు న్యాయవాది హైకోర్టును అభ్యర్థించారు. గత ప్రభుత్వం ఈ ఇద్దరు న్యాయమూర్తులకు అమరావతి (Amaravati) ప్రాంతంలో 6వందల గజాల స్థలాన్ని రూ.5వేల చొప్పున కేటాయించిందని గుర్తుచేశారు. కాబట్టి ఈ ఇద్దరినీ విచారణ బెంచ్ నుంచి తప్పించాలని కోరారు. అయితే సీజే మిశ్రా అందుకు నిరాకరించారు. అలా అయితే ఏదో ఒక కారణం చూపి ప్రతీ జడ్జిని కేసు నుంచి తప్పించాలని కోరుతారన్నారు. అమరావతిపై విచారణను వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని అన్నారు.
Also Read: AP Three Capital Issue: కేసు విచారణ నుంచి ఆ న్యాయమూర్తులు తప్పుకుంటారా లేదా
ఓవైపు అమరావతి (Amaravati) అంశం కోర్టు విచారణ పరిధిలో ఉండగానే మరోవైపు అక్కడి రైతులు పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. న్యాయస్థానం టు దేవస్థానం పేరిట రైతులు మహాపాదయాత్రను చేపట్టారు. డిసెంబర్ 15న ఈ పాదయాత్ర తిరుపతిలో ముగుస్తుంది. రాజధాని అమరావతిలోనే కొనసాగాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Amaravati: హాట్ టాపిక్‌గా అమరావతిపై హైకోర్టు చీఫ్ జస్టిస్ కామెంట్స్.
అమరావతిపై హైకోర్టు చీఫ్ జస్టిస్ కీలక వ్యాఖ్యలు
అమరావతి కేవలం రైతుల రాజధాని కాదు.. ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని
30 వేల మంది రైతులు రాజధానికి స్వచ్చందంగా భూములిచ్చారన్న సీజే