ఏపీలో తొలిసారిగా.. 'క్లిక్' చేస్తే పాఠాలు ప్రత్యక్షం!

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం అందించే ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ స్వరూపం మారింది.

Last Updated : Jun 26, 2018, 04:13 PM IST
ఏపీలో తొలిసారిగా.. 'క్లిక్' చేస్తే పాఠాలు ప్రత్యక్షం!

ఆంధ్రప్రదేశ్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం అందించే ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ స్వరూపం మారింది. వీటి ముద్రణలో తొలిసారిగా ఏపీ ప్రభుత్వం సాంకేతికతను వినియోగించింది. పాఠ్యపుస్తకాలపై ఉన్న క్యూఆర్‌ కోడ్‌ను ఆండ్రాయిడ్‌ ఫోన్‌ ద్వారా, ల్యాప్‌ట్యాప్‌కు అనుసంధానం చేసి క్లిక్‌ చేస్తే ఆ అంశానికి సంబంధించిన పాఠం స్క్రీన్‌పై కనిపించనుంది. దానిని దృశ్య రూపంలోనూ విద్యార్థులు వీక్షించవచ్చు. ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచి ఈ విధానం అమల్లోకి వచ్చింది.

పాఠ్యాంశాలు సులువుగా అర్థమయ్యే రీతిలో ఉంటాయని, పాఠ్యపుస్తకంలోని క్యూఆర్‌ కోడ్‌పై ఒక క్లిక్‌చేస్తే అందుకు సంబంధించిన పూర్తి సమాచారం క్షణాల్లో తెలుసుకోవచ్చని విద్యాశాఖ అధికారి ఒకరు తెలిపారు. అంతేకాదు.. ఈ కోడ్‌ వల్ల ప్రభుత్వ పాఠ్యపుస్తకాలు పక్కదారి పట్టకుండా భద్రత కల్పించారు.

విద్యార్థులకు కావాల్సిన ప్రాథమిక సమాచారాన్ని పుస్తకాల్లో ముద్రించి పూర్తి సమచారాన్ని కోడ్‌లో భద్రపరుస్తారు. విద్యార్థులు కోడ్‌ను ఓపెన్‌ చేసి పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఈ విధానంతో విద్యార్థులకు పుస్తకాల భారం తగ్గనుందని విద్యాశాఖ అధికారులు తెలిపారు. 

Trending News