ప్రొఫెసర్ కాబోతున్న కమెడియన్ బ్రహ్మానందం

తెలుగు సినిమా చరిత్రలో సుదీర్ఘ కాలంపాటు నవ్వులు పండిస్తున్న ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందానికి మరో అరుదైన అవకాశం లభించింది. తన సినిమా చరిత్రలో 35 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా విశాఖలో ఆయనకు ఘనంగా సన్మానం జరిగిన సంగతి తెలిసిందే. విశాఖ రైటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సన్మానంలో భాగంగా బ్రహ్మానందానికి వెండి కిరీటం పెట్టి, 35 

Last Updated : Feb 2, 2020, 10:10 PM IST
ప్రొఫెసర్ కాబోతున్న కమెడియన్ బ్రహ్మానందం

అమరావతి : తెలుగు సినిమా చరిత్రలో సుదీర్ఘ కాలంపాటు నవ్వులు పండిస్తున్న ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందానికి మరో అరుదైన అవకాశం లభించింది. తన సినిమా చరిత్రలో 35 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా విశాఖలో ఆయనకు ఘనంగా సన్మానం జరిగిన సంగతి తెలిసిందే. విశాఖ రైటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సన్మానంలో భాగంగా బ్రహ్మానందానికి వెండి కిరీటం పెట్టి, 35 స్వర్ణ పుష్పాలతో అభిషేకం చేశారు. హాస్య దిగ్గజంబ్రహ్మానందానికి స్వర్ణ కంకణంతో అలంకరించారు. 35 సంఘాల ప్రతినిధులు పూలమాలలతో సత్కరించారు. బ్రహ్మానందం 35 ఏళ్ల సినీ జీవిత విశేషాలతో పుస్తకాన్ని కూడా ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆంధ్రా విశ్వవిద్యాలయం వీసీ ప్రసాద్ రెడ్డి కమెడియన్ బ్రహ్మానందానికి అద్భుతమైన అవకాశం కల్పించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం విజిటింగ్ ప్రొఫెసర్ గా బ్రహ్మానందానికి ఆహ్వానం పలుకుతున్నామని తెలిపారు. ఏయూ థియేటర్, పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ విభాగంలో సేవలు అందించాలని కోరుతున్నట్టు తెలిపారు. 
  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News