AP Curfew: కరోనా మహమ్మారి నియంత్రణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. కరోనా సంక్రమణ నేపధ్యంలో జూ పార్క్‌లు మూసివేస్తున్నట్టు ప్రకటించింది. మరోవైపు రేపటి నుంచి అమలు కానున్న కర్ఫ్యూకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave)కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు ఏపీ ప్రభుత్వం (Ap government) ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇప్పటివరకూ నైట్ కర్ఫ్యూ అమలు చేసిన ఏపీ..ఇప్పుడిక పగటి పూట కూడా కర్ఫ్యూ అమలు చేయనుంది. మరోవైపు కోవిడ్ వ్యాప్తి నేపధ్యంలో అన్ని జూ పార్క్‌లు మూసివేస్తున్నట్టు అటవీశాఖ వెల్లడించింది. జూలతో పాటు ఎకో టూరిజం సెంటర్లు టెంపుల్ ఎకో పార్క్‌లు మూసివేయాలని నిర్ణయించింది. జూ పార్క్‌లలో జంతువుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించింది.
ఇక రేపటి నుంచి రాష్ట్రంలో కర్ఫ్యూ అమలు కానుంది. ఏపీ కేబినెట్(Ap Cabinet) ఈ మేరకు ఆమోదం తెలిపింది. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకే షాపులకు అనుమతి ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి మర్నాడు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుంది. మధ్యాహ్నం నుంచి ప్రజా రవాణా వాహనాలను పూర్తిగా నిలిపివేయాలని కేబినెట్ నిర్ణయించింది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు, అంతర్రాష్ట్ర సర్వీసులు నిలిచిపోనున్నాయి.
Also read: AP 10th Class Exams: పదవ తరగతి పరీక్షల పరిస్థితి ఏంటి, ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుందంటే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook