Ys Jagan Review: రాష్ట్రంలో ప్రతి మహిళ చేతిలో దిశ యాప్ ఉండాల్సిందే

Ys Jagan Review: దిశ యాప్ ప్రతి మహిళ సెల్‌ఫోన్‌లో కచ్చితంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సూచించారు. రాష్ట్రంలోని శాంతిభద్రతలపై విస్తృతంగా సమీక్షించిన జగన్ పలు ఆదేశాలిచ్చారు. దిశ చట్టం, దిశ యాప్‌పై ప్రత్యేకంగా చర్చించారు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 4, 2021, 05:16 PM IST
  • ఏపీలో శాంతి భద్రతలపై విస్తృతంగా సమీక్షించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్
  • దిశ యాప్ , దిశ చట్టం ప్రగతిపై వివరాలు అడిగి తెలుసుకున్న జగన్
  • దిశ యాప్ రాష్ట్రంలోని ప్రతి మహిళ సెల్‌ఫోన్‌లో ఉండాలని సూచించిన ముఖ్యమంత్రి
 Ys Jagan Review: రాష్ట్రంలో ప్రతి మహిళ చేతిలో దిశ యాప్ ఉండాల్సిందే

Ys Jagan Review: దిశ యాప్ ప్రతి మహిళ సెల్‌ఫోన్‌లో కచ్చితంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సూచించారు. రాష్ట్రంలోని శాంతిభద్రతలపై విస్తృతంగా సమీక్షించిన జగన్ పలు ఆదేశాలిచ్చారు. దిశ చట్టం, దిశ యాప్‌పై ప్రత్యేకంగా చర్చించారు.

ఏపీలోని శాంతిభద్రతల పరిస్థితి, కీలకమైన విషయాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్(Ap cm ys jagan) అధికారులతో సమీక్ష నిర్వహించారు. దిశ చట్టం అమలు, మహిళలు, చిన్నారులపై నేరాల విచారణకు సంబంధించి ప్రత్యేక కోర్టులు, నేరాల నియంత్రణకై తీసుకుంటున చర్యలు, పోలీసు బలగాల్ని బలోపేతం చేయడం, మాదక ద్రవ్యాల నిరోధం వంటి కీలకమైన అంశాలపై వైఎస్ జగన్ చర్చించారు. మరీ ముఖ్యంగా దిశ చట్టం ప్రగతిపై సమీక్షించి పలు ఆదేశాలు, సూచనలు ఇచ్చారు.

ఇప్పటి వరకూ 74 లక్షల 13 వేల 562 మంది దిశ యాప్‌ను డౌన్‌లోడ్(Disha App Download) చేశారని అధికారులు వెల్లడించారు. దిశ యాప్(Disha App)ద్వారా ఇప్పటి వరకూ 5 వేల 238 మంది సహాయం అందింది. దిశ యాప్ ద్వారా రిజిస్టర్ చేసిన ఎఫ్ఐఆర్‌లు ఈ ఏడాదిలో 684 కాగా నేరాలకు ఆస్కారమున్న ప్రాంతాల్ని మ్యాపింగ్ చేసే పని పూర్తయిందని పోలీసులు తెలిపారు. ఫిర్యాదులపై పరిష్కారం విషయంలో ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ పంపిస్తున్నామన్నారు. దిశ పోలీస్ స్టేషన్లు అన్నింటికీ ఐఎస్ఓ సర్టిఫికేట్ వచ్చిందని తెలిపారు. మహిళలపై నేరాలకు సంబంధించి దర్యాప్తుకు 2017లో 189 రోజుల సమయం పడితే..2021లో కేవలం 42 రోజుల్లో ఛార్జిషీటు దాఖలవుతోందని ముఖ్యమంత్రికి వివరించారు. జీరో ఎఫ్ఐఆర్‌లు కూడా నమోదు చేస్తున్నామన్నారు. ఫోరెన్సిక్ సదుపాయాల్ని ప్రభుత్వం పెంచడం వల్ల కేసుల దర్యాప్తు, ఛార్జిషీటులో వేగం పెరిగిందని తెలిపారు. గతంలో డీఎన్ఏ రిపోర్టుకు చాలా సమయం పట్టేదని..ఇప్పుడు కేవలం రెండ్రోజుల్లో నివేదిక వస్తోందని పోలీసులు స్పష్టం చేశారు. 

దిశ యాప్‌కు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలకమైన సూచనలు చేశారు. దిశను చాలా సమర్ధవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రతి మహిళ సెల్‌ఫోన్‌లో దిశ యాప్ ఉండాలని సూచించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు దిశ యాప్‌పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వాలంటీర్లు, మహిళా పోలీసుల సహాయంతో ప్రతి మహిళ సెల్‌ఫోన్‌లో దిశ యాప్ డౌన్‌లోడ్ చేయించాలన్నారు. దిశ యాప్‌పై విస్తృత ప్రచారం చేయడమే కాకుండా దిశ యాప్ ఎలా డౌన్‌లోడ్ చేయాలి, ఎలా వినియోగించాలో చెప్పాలన్నారు. 

ఇక పార్లమెంట్‌లో దిశ బిల్లు ఆమోదం ఏ దశలో ఉందనేది అధికారులు ముఖ్యమంత్రి జగన్‌కు వివరించారు. శాసనసభలో బిల్లును ఆమోదించి చాలా రోజులైనా...పెండింగ్‌లో పెట్టడం సరైంది కాదని జగన్ అభిప్రాయపడ్డారు. మరోవైపు ప్రత్యేక కోర్టుల ఏర్పాటుపై జగన్ చర్చించారు. పోక్సో కేసుల విచారణకు ప్రస్తుతం 10 కోర్టులు ఆపరేషన్‌లో ఉన్నాయని..డిసెంబర్ నాటికి మరో 6 కోర్టులు అందుబాటులో వస్తాయని అధికారులు తెలిపారు. 

Also read: Lakhimpur Kheri Protest: లఖీంపూర్ ఖేరీ ఘటనకు నిరసనగా వెల్లువెత్తిన ఆందోళనలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News