Ys Jagan Strategy: ఏపీలో అధికారపార్టీ ఎన్నికల ప్రణాళిక రచిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కార్యకర్తల్ని, నేతల్ని ఇప్పట్నించే ఎన్నికలకు సంసిద్ధుల్ని చేస్తున్నారు. ప్రతిపక్షం ఏకమౌతున్న తరుణంలో వ్యూహాలు మార్చేందుకు సిద్ధమౌతున్నారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 2024 ఎన్నికలకు ప్రణాళిక సిద్ధం చేశారు. పార్టీ ప్రముఖులు, నేతలకు కీలక బాథ్యతలు అప్పగిస్తున్నారు. అటు ప్రభుత్వం, ఇటు పార్టీ రెండింటీ బాధ్యతల్ని విభజిస్తున్నారు. కొందరు సీనియర్లకు పార్టీ కీలక బాధ్యతలు అప్పగించే యోచన చేస్తున్నారు. మంత్రివర్గ విస్తరణ నేపధ్యంలో కేబినెట్ నుంచి తొలగించినవారికి పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించనున్నారు. అంటే జిల్లా పార్టీ బాథ్యతలు వారికే అప్పగిస్తారు. ఇక మరోవైపు కొత్తగా కొంతమందిని మంత్రివర్గంలో తీసుకోనున్నారు.
అటు ప్రతిపక్షాలు వైఎస్ జగన్ టార్గెట్‌గా ఏకం అవుతున్న సంకేతాలు కన్పిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని విషయాల్లో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ జనసేనకు మద్దతుగా నిలుస్తోంది. జనసేన, బీజేపీ ఇప్పటికే పొత్తులో ఉన్నాయి. 2024లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా 2014 పొత్తులు పునరావృతమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. జగన్‌ను ఓడించడమే లక్ష్యమని..ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే స్పష్టం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై పోరాటానికి బీజేపీ రూట్‌మ్యాప్ ఇస్తుందని కూడా అన్నారు. అంటే అన్నీ అనుకూలిస్తే 2024 ఎన్నికలకు బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయవచ్చని తెలుస్తోంది. 2014లో కూడా ఈ మూడు పార్టీలు కలిసే ఉన్నాయి. అయితే అప్పట్లో జనసేన పోటీ చేయకుండా బీజేపీ, టీడీపీలకు మద్దతిచ్చింది.
మరోవైపు 2024 ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని వ్యవస్థాపరంగా పార్టీని బలోపేతం చేసే చర్యలకు దిగారు వైఎస్ జగన్. ప్రభుత్వంలోనూ, పార్టీలోనూ మార్పులు చేయనున్నారు. కొత్త జిల్లాల్లో పార్టీ ఇన్‌ఛార్జ్‌ల నియామకం జరగనుంది. మంత్రివర్గ విస్తరణలో పదవులు కోల్పోయినవారిని జిల్లా అధ్యక్షులుగా నియమించనున్నారు. ప్రతి జిల్లాకు అధ్యక్షుడు, ఎంపీ, ఏడుగురు ఎమ్మెల్యేలతో కమిటీ ఉంటుంది. అదే విధంగా ప్రతి నియోజకవర్గానికి ఓ కమిటీ ఉంటుంది. సంస్థాగతంగా ఈ ఏర్పాట్లు పూర్తయిన తరువాత..కొత్త కమిటీలతో జూన్ 8వ తేదీన పార్టీ ప్లీనరీ ఉంటుంది. ఈ ప్లీనరీకు పార్టీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ హాజరయ్యే అవకాశాలున్నాయి.
ఇక అన్నింటికంటే ముఖ్యంగా జూన్‌లో జరిగే ప్లీనరీ నుంచి పార్టీ అధినేత వైఎస్ జగన్ సహా నేతలంతా ప్రజల్లో ఉండాలని ఆదేశాలందాయి. ఇందులో భాగంగా నిత్యం రోడ్లుపైనే ఉండేలా ప్రణాళిక రూపొందించనున్నారు. 2014 పొత్తులు కచ్చితంగా రిపీట్ అవుతాయని వైసీపీ బలంగా నమ్మతోంది. అందుకే 2024 ఎన్నికల నాటికి పార్టీ బలం ఏ మాత్రం తగ్గకూడదనేది పార్టీ ఆలోచన.
Also read: Intermediate Exams: ఏపీ ఇంటర్ పరీక్షలకు జేఈఈ మెయిన్స్ గ్రహణం, మళ్లీ వాయిదా పడనున్న పరీక్షలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook