Ys jagan visakha tour: ఆసక్తి రేపుతున్న సీఎం జగన్ విశాఖ పర్యటన, స్టీల్‌ప్లాంట్ ఉద్యోగుల జేఏసీని కలవనున్న జగన్

Ys jagan visakha tour: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖపట్నం పర్యటన ఆసక్తి రేపుతోంది. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ, రోడ్డెక్కిన ఉద్యోగ, కార్మిక సంఘాల నేపధ్యంలో వైఎస్ జగన్ పర్యటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.  

Last Updated : Feb 16, 2021, 06:33 PM IST
  • ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు విశాఖ పర్యటన
  • స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నేపధ్యంలో ఆసక్తి రేపుతున్న సీఎం జగన్ పర్యటన
  • శారదా పీఠం వార్షికోత్సవాల అనంతరం స్టీల్ ప్లాంట్ ఉద్యోగ జేఏసీని కలవనున్న సీఎం జగన్
Ys jagan visakha tour: ఆసక్తి రేపుతున్న సీఎం జగన్  విశాఖ పర్యటన, స్టీల్‌ప్లాంట్ ఉద్యోగుల జేఏసీని కలవనున్న జగన్

Ys jagan visakha tour: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖపట్నం పర్యటన ఆసక్తి రేపుతోంది. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ, రోడ్డెక్కిన ఉద్యోగ, కార్మిక సంఘాల నేపధ్యంలో వైఎస్ జగన్ పర్యటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో సాధించుకున్న విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ( Visakha steel plant privatisation ) కాబోతుంది. కేంద్ర ప్రభుత్వం ( Central government ) తీసుకున్న నిర్ణయంతో ఒక్కసారిగా ఆంధ్రుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఉద్యోగ, కార్మిక సంఘాలు రోడ్డెక్కాయి. నిరసన పెల్లుబుకుతోంది. అధికారపార్టీ నేతలు కూడా విశాఖ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమంలో పాల్గొంటున్నారు. అటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సైతం విశాఖ స్టీల్ ప్లాంట్ ( Visakha steel plant ) ‌ను ప్రైవేట్‌పరం చేయవద్దంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ( Pm Narendra modi )కు లేఖ రాశారు. ప్రతిపక్షాలు మాత్రం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు అధికార పార్టీనే టార్గెట్ చేస్తున్నాయి.  

ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ap cm ys jagan ) విశాఖపట్నం పర్యటన ఆసక్తి రేపుతోంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ స్టీల్‌ప్లాంట్ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న నేపధ్యంలో సీఎం జగన్ విశాఖలో పర్యటిస్తుండంతో ఏం జరుగుతోందో అనే టెన్షన్ నెలకొంది. వాస్తవానికి శారదా పీఠం వార్షికోత్సవాలకు సీఎం జగన్ హాజరు కాబోతున్నారు.  ఆ కార్యక్రమం  అనంతరం స్టీల్‌ప్లాంట్ ఉద్యోగుల జేఏసీ ( Steel plant employees jac )ని సీఎం జగన్ కలువనున్నారు. అటు టీడీపీ తో పాటు అన్ని రాజకీయ పక్షాలు స్టీల్‌ప్లాంట్ వ్యవహారంలో వైఎస్ జగన్ సరిగా స్పందించడం లేదని విమర్శలు చేస్తున్న తరుణంలో జగన్ విశాఖకు వస్తుండటం, జేఎసి నాయకులను కలవబోతుండంతో విశాఖలో రాజకీయాలు వేడెక్కనున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటనపైనే అందరి దృష్టీ నెలకొంది.  ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అధికారపార్టీ ఇప్పుటికే మహా పాదయాత్రకు పిలుపునిచ్చింది. 

Also read: Visakha steel plant: అచ్చెన్నా..ఒళ్లు దగ్గర పెట్టుకో: మంత్రి అవంతి శ్రీనివాస్ వార్నింగ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News