AP Fake Votes: ఏపీలో భారీగా దొంగ ఓట్లు, 5.64 లక్షల ఓట్లు తొలగింపు, అధికారులపై వేటు

AP Fake Votes: ఏపీలో ఎన్నికలు దగ్గరపడేకొద్దీ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. కొత్తగా బోగస్ ఓట్ల రాజకీయం ఊపందుకుంది. భారీగా నమోదైన దొంగ ఓట్లపై ఎన్నికల సంఘం కొరడా ఝులిపించింది. దొంగ ఓట్లను తొలగించింది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 10, 2024, 11:37 AM IST
AP Fake Votes: ఏపీలో భారీగా దొంగ ఓట్లు, 5.64 లక్షల ఓట్లు తొలగింపు, అధికారులపై వేటు

AP Fake Votes: దొంగెవరో తెలియదు గానీ అందరూ ఒకరి నొకరు దొంగా దొంగా అని ఆరోపించుకుంటున్నారు. ఏపీలో ఇప్పుడు దొంగ ఓట్ల రాజకీయాలు నడుస్తున్నాయి. ఏపీలో భారీగా నమోదైన దొంగ ఓట్లపై దృష్టి సారించిన ఎన్నికల సంఘం ఆ ఓట్లు తొలగించేసింది. 

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. పార్టీ అభ్యర్ధుల కసరత్తుతో పాటు ఎన్నికల నిర్వహణపై కూడా పార్టీలు దృష్టి సారించాయి. ఎన్నికలు సమీపించే కొద్దీ నకిలీ ఓట్లు, అనర్హులను జాబితాలో చేర్చడం వంటివి చోటుచేసుకుంటున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం, జనసేన అన్ని పార్టీలు వీలైనంతగా దొంగ ఓట్లను చేరుస్తున్నాయి. ఇలా ఏపీలో 15 లక్షల వరకూ నకిలీ ఓట్లు నమోదైనట్టు తెలుస్తోంది. మూడు పార్టీలు దొంగ ఓట్ల చేరికపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశాయి. దొంగ ఓట్ల వ్యవహారంపై ఫిర్యాదులు రోజురోజుకూ ఎక్కువ కావడంతో ఎన్నికల సంఘం స్పందించింది. ప్రాధమికంగా 5.64 లక్షల దొంగ ఓట్లను గుర్తించి తొలగించింది. రాజకీయ పార్టీలు ఆరోపించిన 15 లక్షల ఓట్లలో 5.64 లక్షల ఓట్లు తొలగించబడ్డాయి. మిగిలిన ఓట్లు సక్రమమైనవేనని ఎన్నికల సంఘం అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. 

నిబంధనలకు విరుద్ధంగా నమోదైన ప్రత్యర్ధుల ఓట్లను తొలగించాలని కోరుతూ ఫామ్ 7లు భారీగా దాఖలౌతున్నాయి. కాకినాడ, ఒంగోలు, గుంటూరు వెస్ట్, చంద్రగిరి, బనగానపల్లెలో కేసులు నమోదయ్యాయి. నకిలీ ఓట్లను తొలగించిన ఎన్నికల సంఘం కొందరు అధికార్లపై కూడా చర్యలు తీసుకుంది. ఉరవకొండలో ఇద్దరు ఈఆర్వోలు, ప్రొద్దుటూరులో ఒక ఈఆర్వో, పర్చూరులో ఒక ఈఆర్వో, , ఒక సీఐ, ముగ్గురు ఎస్సైలను ఈసీ సస్పెండ్ చేసింది. మరో 50 మంది బీఆర్వోలను కూడా సస్పెండ్ చేసింది. 

Also read: Kesineni Nani: వైసీపీ తీర్ధం పుచ్చుకోనున్న కేశినేని నాని, షరతులు వర్తిస్తాయా లేదా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News